కోడి పందేలకు ఇరువురి బలి–నేరవార్తలు–01/11

* కృష్ణాజిల్లాలో గురువారం అర్థరాత్రి ప్రమాదవశాత్తూ ఇద్దరు యువకులు నూతిలో పడి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. చిత్తాపూర్‌లో ఇద్దరు యువకులు నిన్న అర్థరాత్రి కోడి పందాలు నిర్వహిస్తూ పోలీసులను చూసి భయపడి పారిపోతూ ప్రమాదవశాత్తూ నూతిలో పడి మరణించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలు సేకరించి, చనిపోయిన ఇద్దరు యువకులు విసన్నపేట మండలం కొండపర్వ గ్రామానికి చెందిన కుక్కల చెన్నారావు, చిత్తపూరు గ్రామానికి చెందిన చిట్టూరి శ్రీను లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
* అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లోని వ్యాసపురం గ్రామ నికి చెందిన మారెన్న ,భార్య విశాలక్షి కుటుంబ కలహాలు తో భార్య నిద్రస్థున్న సమయంలో గొడ్డలితో నరికి, నేరమేట్ల గ్రామ నికి చెందిన లింగారెడ్డి పొలంలో మారెన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
* మంగళగిరి హైవేపై అగ్నికి ఆహుతైన కారు.. పరుగులు తీసిన ప్రయాణికులు
విజయవాడ వెళ్తున్న ఓ కారు గుంటూరు సమీపంలో అగ్నికి ఆహుతైంది. మంగళగిరి జాతీయ రహదారి ఫ్లై ఓవర్‌పై ఈ ఘటన జరిగింది. విజయవాడవైపు వెళ్తున్న మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, అందులోని నలుగురు ప్రయాణికులు కారును ఆపి కిందికి దిగి పరుగులు తీశారు. ఈ క్రమంలో డ్రైవర్ కాలికి స్వల్పంగా గాయాలయ్యాయి. చిన్నగా మొదలైన మంటలు క్షణాల్లోనే కారంతా వ్యాపించి బుగ్గి చేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో వంతెనపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఇంజిన్ నుంచి మంటలు చెలరేగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
* వరంగల్ అర్బన్ కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.దగ్దమవుతున్న రెండు లారీలు.
అప్రమత్తమై మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది.
*ఔటర్‌పై ప్రమాదం.. ముగ్గురి మృతి
రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రావిరాల వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్సును కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఏలూరు నుంచి రోగిని హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా.. కారు అదుపుతప్పి అంబులెన్స్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్సులోని ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్‌ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
*అనిశా వలలో పరిశ్రమల శాఖ మేనేజర్‌
లంచం తీసుకుంటూ మహబూబాబాద్‌ జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్‌ వీరేశం అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు చిక్కారు. లబ్ధిదారుడి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా అనిశా వరంగల్‌ రేంజి డీఎస్పీ కె.భద్రయ్య నేతృత్వంలోని బృందం గురువారం పట్టుకుంది.
*కాన్పులో నిర్లక్ష్యం.. బిడ్డ రెండు ముక్కలు
కాన్పు సమయంలో ఓ నర్సు నిర్లక్ష్యం కారణంగా బిడ్డ రెండు ముక్కలైంది. ఈ ఘోరం రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. జైసల్మేర్‌లోని రాంగఢ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి దీక్షా కన్వర్‌ అనే మహిళ ప్రసవం కోసం వెళ్లగా, కాన్పు సమయంలో నర్సు శిశువును బలవంతంగా బయటికి లాగడంతో బిడ్డ రెండు ముక్కలైంది.
*పక్కా వ్యూహంతోనే పెద్దపులి వధ
నిర్మల్‌ జిల్లా పెంబి అటవీ ప్రాంతంలో హత్యకు గురైన పెద్దపులి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అడవిలో విద్యుత్తు వైరును అమర్చి కరెంటు షాక్‌తో పులిని చంపినట్లు అటవీశాఖ గుర్తించింది. ఇదేదో చిన్న జంతువుల కోసం పెట్టింది కాదని, పెద్ద పులి సంచరిస్తుందన్న విషయాన్ని పక్కాగా నిర్ధారించుకుని కరెంటు వైరుతో చంపారని అటవీశాఖ నిర్ధారణకు వచ్చింది. మరోవైపు పెద్దపులిని చంపిన తీరును పరిశీలిస్తే.. స్థానిక అటవీ అధికారుల ఘోర వైఫల్యం ఉందని వెల్లడవుతోంది. రోజుల తరబడి వేటగాళ్లు అడవిలో కరెంటు తీగలు అమరిస్తే అధికారులు పసిగట్టలేకపోయారని వన్యప్రాణి ప్రేమికులు, స్థానికులు మండిపడుతున్నారు.
*గాలిపటం ఎగరేస్తూ బావిలో పడి బాలుడి దుర్మరణం!
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రాయగిరి గ్రామంలో గురువారం ఉదయం అదృశ్యమైన ఆరేళ్ల బాలుడు చివరకు రాత్రిపూట ఓ పాడుబడిన బావిలో మృతదేహమై కనిపించాడు. గాలిపటం ఎగురవేస్తూ ఆ బావిలోకి జారిపడి మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు.
* భార్యను చంపి ఆత్మహత్య.. ఒంటరైన చిన్నారులు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వ్యాసపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో ఓ భర్త తన భార్యను గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. అనంతరం తానూ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. వ్యాసపురంలో నివాసముండే మరన్నకు తన భార్య విశాలపై అనుమానం ఉండేది. దీంతో నిత్యం వారి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మరన్న.. గొడ్డలితో భార్య విశాలను దారుణంగా నరికి చంపాడు.
* అనుమానంతో మేనల్లుడి హత్య
ప్రియురాలితో సన్నిహితంగా ఉంటున్నాడన్న అనుమానంతో సొంత మేనల్లుడినే హత్య చేసి పరారైన నిందితుడిని దిల్లీ పోలీసులు మూడు సంవత్సరాల తరువాత హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఒడిశాకు చెందిన బిజయ్‌ కుమార్‌ మహరాణా అనే వ్యక్తి 2012లో దిల్లీకి ఉద్యోగ నిమిత్తం వచ్చాడు. అప్పటికే అతని స్నేహితురాలు దిల్లీలో ఉంటున్నారు. 2015లో బిజయ్‌ మేనల్లుడు జయప్రకాశ్‌ హైదరాబాద్‌ నుంచి దిల్లీకి చేరుకొని ద్వారక ఏరియాలో బిజయ్‌తో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. బిజయ్‌ నోయిడా సెక్టార్‌లో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తుండగా, జయప్రకాశ్‌ గుర్గావ్‌కు చెందిన ఓ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు.
* టీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తలపై దాడి
కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఓటమి భయంతో, టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నారనే నేపంతో భౌతిక దాడులకు దిగుతున్నారని అల్లాదుర్గం మండలం రెడ్డిపల్లి టీఆర్‌ఎస్‌ నాయకులు రవీందర్‌రెడ్డి, పోచయ్యలు గురువారం స్థానిక విలేకర్లతో చెప్పారు. బుధవారం నామినేషన్లు వేసి ఇళ్లకు వెళ్తున్న దళిత టీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తలపై రాళ్లదాడి చేశారన్నారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన గడ్డం భూమమ్మకు తలపగిలి తీవ్ర గాయాలయ్యయని తెలిపారు.
*నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైల్వే ట్రాక్ పై జంట ఆత్మహత్య. వరసకు వదిన మరిది కావడం వివాహేతర సంబంధమే కారణం అని తెలుస్తుంది.
*గుంటూరు నగరం లో విరాళాలు పేరుతో యువకులను టార్గెట్ చేస్తూ హల్చల్ చేస్తున్న ముఠాని అదుపులోకి తీసుకున్న పోలీసులు. విచారణ కొరకు స్టేషన్ కి తరలింపు.
*17న తీర్పు
జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో గుర్మిత్ రామ్ రహీంతో పాటు మరో ముగ్గురిని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. కేసులో ఈ నెల 17వ తేదీన శిక్ష తీర్పును వెలవరించనున్నట్లు పేర్కొంది. గుర్మిత్ సింగ్ మహిళల వేధింపుల గురించి జర్నలిస్ట్ రామచంద్ర 2002లో ప్యూర్ సచ్ఛ్ న్యూస్ పేపర్‌లో వార్తా కథనాలు రాశాడు. ఈ వార్తా ప్రచురణ అనంతరం అతడు హత్యకు గురయ్యాడు. దర్యాప్తులో గుర్మిత్ సింగ్ ప్రధాన కారకుడిగా ఉన్నట్లు తేలింది. కేసు విచారణ చేపట్టిన పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు జర్నలిస్ట్ హత్య కేసులో గుర్మిత్ సింగ్‌తో పాటు మరో ముగ్గురిని దోషులుగా తేల్చుతూ నేడు తీర్పును వెలువరించింది. కాగా తన ఇద్దరు మహిళా అనుచరులను అత్యాచారం చేసిన కేసులో గుర్మిత్‌సింగ్ ఇప్పటికే జైలు జీవితం గడుపుతున్నాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com