Food

బీట్‌రూట్ తాగితే బ్లడ్ పడాల్సిందే!

బీట్‌రూట్ తాగితే బ్లడ్ పడాల్సిందే!

రక్తహీనతకు బీట్‌రూట్ ‌
మనదేశంలో రక్తహీనత బారిన పడేవారి సంఖ్య డెబ్భైశాతం కన్నా ఎక్కువే ఉంటుంది. శరీరంలో తగినంత ఇనుము లేకపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. ఎందుకు అని ఆలోచించడం కన్నా.. దాన్నుంచి బయటపడేందుకు ఏం చేయాలనేది చూద్దాం.
**బీట్‌రూట్‌…
దీనిలో అధిక మొత్తంలో ఇనుము ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. ప్రతిరోజూ బీట్‌రూట్‌ రసం తాగడం వల్ల మీ శరీరానికి ఎంతోకొంత ఇనుము అందుతుంది. దీన్ని సలాడ్‌గా, ఇతర కూరగాయలతో కూడా కలిపి తీసుకోవచ్చు.
**అరటిపండు…
ఇందులోనూ పోషకాలు ఎక్కువ. వాటిలో ఇనుము ఒకటి. ప్రతిరోజూ అరటిపండును తేనెతో కలిపి తీసుకుంటే ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుంది.
**ఖర్జూరాలు…
వీటిలో కూడా విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. రాత్రిపూట గ్లాసు వేడిపాలలో రెండుమూడు ఖర్జురాలను నానబెట్టి ఉదయంపూట పరగడుపునే తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
**దానిమ్మ…
ఇందులో విటమిన్‌-సి ఎక్కువ. ఇది ఇనుమును గ్రహించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. దాల్చిన చెక్క పొడీ, తేనెతో కలిపి ప్రతిరోజూ ఉదయంపూట దానిమ్మ రసాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ పరిమాణం పెరుగుతుంది. దానిమ్మను నేరుగా తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
**ఆకుకూరలు…
పాలకూరా, మెంతీ, తోటకూర … ఇలా ఆకు కూరలన్నింటిలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-బీ12, ఫోలిక్‌ యాసిడ్‌, ఇతర శక్తిని ఇచ్చే పోషకాలు ఉంటాయి. ఇవన్నీ రక్తహీనతను తరిమికొడతాయి. కాబట్టి మీ ఆహారంలో ప్రతిరోజూ ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి.