నేడు రాహుల్ ద్రావిడ్ జన్మదినోత్సవం

మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మైదానంలో, బయట తన వ్యక్తిత్వంతో ఆకట్టుకుంటాడు. ఈ ‘మిస్టర్‌ డిపెండబుల్’ వివాద రహితుడిగానూ పేరుపొందాడు. ప్రతిసారి ఆయన బ్యాట్ మాత్రమే మాట్లాడేది. అయితే ఈ రోజు ద్రవిడ్ గురించి మాట్లాడుకోడానికి పుట్టినరోజు ఒక కారణం కాగా, మరొకటి ఓ టీవీ కార్యక్రమం సందర్భంగా ద్రవిడ్‌ వ్యవహరించిన తీరు. కొద్ది రోజుల క్రితం ఓ షో సందర్భంగా భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ మాట్లాడిన తీరు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దాన్ని ఉద్దేశించి నెటిజన్లు ద్రవిడ్‌కు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసి, దాన్ని చూసి నేర్చుకోమని పాండ్యకు సలహా ఇచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం రాహుల్ ద్రవిడ్ ‘ఎంటీవీ బకరా’ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. దాంట్లో అతడిని మహిళా జర్నలిస్టు ఇంటర్వ్యూ చేసింది. చివర్లో తనను పెళ్లి చేసుకోమంటూ ద్రవిడ్‌ను ఒత్తిడి చేయసాగింది. కేవలం ద్రవిడ్‌ను ఆటపట్టించడానికే అలా చేసింది. కానీ ఆ విషయం అతడికి తెలీదు. దాంతో ఒక్కసారిగా ఆయోమయానికి గురైన ద్రవిడ్..ఆమెను కూల్‌గా ఉండమని చెప్పి, బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ ద్రవిడ్‌ను వెళ్లనీకుండా ఆమె తండ్రిలా నటించే వ్యక్తి కూడా ఒప్పించడానికి ప్రయత్నించాడు. ద్రవిడ్ కాస్త నెమ్మదించి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కంటే ముందు చదువుమీద దృష్టి పెట్టాలని ఆ మహిళా అభిమానికి సలహా ఇచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దాన్ని 6,500 మంది రీట్వీట్ చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com