పార్వతి చంద్రులు వీరే

‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ సినిమాలో లక్ష్మీ పార్వతిగా ఎవరు కనిపించబోతున్నారని చాలా రోజులుగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అనేక మంది నటీమణుల పేర్లు బయటికి వచ్చాయి. అయితే ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌‌ను దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ శుక్రవారం విడుదల చేశారు. సినిమాలో కన్నడ నటి యజ్ఞా శెట్టి టైటిల్‌ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఆమె గతంలో వర్మ తీసిన ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ సినిమాలో వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మి పాత్రలో నటించారు. ఓ కన్నడ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును కూడా అందుకున్నారు. అదేవిధంగా ఈ సినిమాలో నారా చంద్రబాబు నాయుడు పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా వర్మ విడుదల చేశారు. లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వర్మ తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటల్ని ఆయన విడుదల చేశారు. ‘వెన్నుపోటు’ అనే పాటను వ్యతిరేకిస్తూ తెదేపా నేతలు ఆరోపణలు కూడా చేశారు. ఈ సినిమాకు ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సోదరుడు కల్యాణ్‌ మాలిక్‌ సంగీతం అందిస్తున్నారు. రాకేష్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 24న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వర్మ ఇప్పటికే ప్రకటించారు. మరోపక్క ఈ సినిమాలోని పాటలు తనను చాలా బాధించాయని ఇటీవల మీడియాతో లక్ష్మీ పార్వతి అన్నట్లు సమాచారం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com