హైదరాబాద్‌లో చదరపు అడుగు ₹4090

నగరంలో ఏడాది కాలంలో ఫ్లాట్ల ధరలు బాగా పెరిగాయి. 2017లో సగటు చ.అ. ధర రూ.3,821 ఉండగా.. 2018 ఆఖరు నాటికి అది కాస్తా రూ.4,090కి పెరిగింది. 12 నెలల వ్యవధిలో ఏకంగా 7 శాతం ధరలు పెరిగాయి. ఇదివరకు పూర్తయి మిగిలిన ఇళ్లు విక్రయించేందుకు 15 నెలలు పట్టేది. డిమాండ్‌ పెరగడంతో ఇప్పుడు 6 నెలల్లోపే విక్రయం అవుతున్నాయి. ఇది మార్కెట్‌ డిమాండ్‌ను సూచిస్తోందని స్థిరాస్తి కన్సల్టెంట్లు అంటున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో చ.అడుగు రూ.10వేలు దాటింది. పెరుగుదల 3 శాతం ఉండగా.. కోకాపేటలో ఏడాది వ్యవధిలో అత్యధికంగా 9 శాతం ధరలు పెరిగాయి. మణికొండ, బండ్లగూడలో 8 శాతం, రాజేంద్రనగర్‌లో 7 శాతం పెరిగాయి. ఎల్‌బీనగర్‌, నాచారం ప్రాంతాల్లో 5 శాతం పెరిగాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం కూడా పెరుగుదలకు కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రాంతాల వారీగా ఎలా ఉందంటే
వ్యవస్థీకృత స్థిరాస్తి మార్కెట్‌లో 2017లో 14,243 ఇళ్లను విక్రయిస్తే 2018లో 15,591 ఇళ్లకు పెరిగింది. విక్రయాలు 9 శాతం పెరిగాయి.
* పశ్చిమం: కూకట్‌పల్లి, మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట ప్రాంతాల్లో ఎక్కువ ఇళ్లు నిర్మించారు. విక్రయాలు ఇక్కడే అధికంగా జరిగాయి. 2018లో 10,492 ఇళ్లను విక్రయించారు.
* ఉత్తరం: కొంపల్లి, మేడ్చల్‌, అల్వాల్‌, కుత్బుల్లాపూర్‌ ప్రాంతం రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 1563 ఇళ్ల కొనుగోళ్లు జరిగాయి.
* దక్షిణం: రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ ప్రాంతాల్లో మార్కెట్‌ విస్తరిస్తోంది. ఇక్కడ 1146 ఇళ్లు విక్రయించారు.
* మధ్య: బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, సోమాజిగూడ, బేగంపేట ప్రాంతాల్లో పాత నివాసాలను పడగొట్టి బహుళ అంతస్తుల నిర్మాణాలు వస్తున్నాయి. ఇక్కడ 1002 ఇళ్లు విక్రయించారు.
* తూర్పు: ఉప్పల్‌, మల్కాజిగిరి, ఎల్‌బీనగర్‌ ప్రాంతాల్లో గతయేడాది వ్యవస్థీకృతంగా 918 ఇళ్ల లావాదేవీలు జరిగాయి.

హైదరాబాద్‌ మార్కెట్‌లో ఫ్లాట్లు రూ.25 లక్షల నుంచి అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఇదివరకు రూ.50 లక్షల లోపు ఉండే ఇళ్ల నిర్మాణాల వాటా అత్యధికంగా ఉండేది. ధరలు పైకి ఎగబాకడంతో ఇప్పుడు సగానికంటే తగ్గింది. అంటే 43 శాతానికి పడిపోయింది. అత్యధికంగా రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల ధరల శ్రేణిలో నిర్మాణాలు గత ఏడాది ఎక్కువగా మొదలయ్యాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com