శబరిమలలో కనువిందుగా జ్యోతి దర్శనం

కేరళలోని శబరిమలలో మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. పంబానది, సన్నిధానం, హిల్‌టాప్‌, టోల్‌ప్లాజా వద్ద మకర జ్యోతి దర్శనం కోసం ట్రావెన్‌కోర్‌ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. స్వామివారి తిరువాభరణాలను సాయంత్రం 6గంటలకు సన్నిధానానికి తరలించారు. సాయంత్రం 6.30గంటలకు దీపారాధనతో తిరువాభరణ ఘట్టం పూర్తయింది. అనంతరం పొన్నాంబలమేడు నుంచి అయ్యప్ప జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మకర జ్యోతిని కనులారా వీక్షించిన భక్తులు తన్మయత్వంతో పులకించి పోయారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తుల శరణుఘోషతో శబరిగిరులు మార్మోగాయి. భక్తులు ఈనెల 19వరకు అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వీలు కల్పించారు. ఈనెల 20న పందళ రాజవంశీకులు స్వామివారి దర్శనం తర్వాత ఆలయం మూసివేస్తారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com