Business

చికెన్ ధరలకు రెక్కలు-వాణిజ్యం

చికెన్ ధరలకు రెక్కలు-వాణిజ్యం

* ఇంధన ధరల్లో తగ్గుదల కనిపించకపోయినప్పటికీ పెరుగుదలకు మాత్రం బ్రేక్‌ పడుతున్నాయి. మరి ఇదే ట్రెండ్ కొనసాగుతుందా..? మళ్లీ డీజీల్, పెట్రోల్ ధరులు పెరుగుతాయా? అన్న చర్చ మొదలైంది. తాజాగా దేశవ్యాప్తంగా శనివారం పెట్రోల్‌, డీజీల్‌ ధరలు ఎలా ఉన్నయో ఓ లుక్కేయండి.ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.17 ఉండగా (శనివారం రూ. 91.17), డీజిల్‌ ధర రూ.81.47 వద్ద ( శనివారం రూ.రూ.81.47 ) కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.57 గా ఉండగా (శనివారం రూ. 97.57 ), డీజిల్‌ రూ.88.60 (శనివారం రూ.88.60 ) గా ఉంది.ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో శుక్రవారంతో పోలిస్తే ఈరోజు పెట్రోల్‌ డీజిల్‌ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.79 (శనివారం రూ. 94.79 ) ఉండగా, డీజిల్‌ ధర రూ. 88.86 (శనివారం రూ. 88.86 )గా నమోదైంది. ఇక తెలంగాణలో మరో ముఖ్య పట్టణం వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 94.37 (శనివారం రూ. 94.37 ), డీజిల్‌ రూ. 88.45 (శనివారం రూ. 88.45 )గా నమోదైంది.ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో ఇంధన ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది.. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97.73 (శనివారం రూ.97.31 ), డీజిల్‌ ధర రూ. 91.23 (శనివారం రూ.90.81) వద్ద కొనసాగుతోంది. సాగర తీరం విశాఖపట్నంలో మాత్రం కాస్త పెరుగుదల కనిపించింది ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.13 (శనివారం రూ. 96.79 )గా ఉండగా, లీటర్‌ డీజిల్‌ రూ. 89.69 (శనివారం రూ.90.30 )గా వద్ద కొనసాగుతోంది.తమిళనాడు రాజధాని చెన్నైలో శనివారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.11 ఉండగా ( శనివారం రూ. 93.11 ), డీజిల్‌ ధర రూ. 86.45 (శనివారం రూ. 86.45 ) వద్ద కొనసాగుతోంది. ఇక కర్నాటక రాజధాని బెంగళూరులో ఈరోజు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.22 (శనివారం రూ. 94.22 ), ఉండగా డీజిల్‌ ధర రూ.86.37 (శనివారం రూ. 86.37 ) గా ఉంది.

* చికెన్ ధర మళ్ళీ పరుగులు తీస్తోంది. కొన్నాళ్ల క్రితం బర్డ్ ఫ్లూ ప్రచారంతో పడిపోయిన చికెన్ ధరలు మళ్ళీ ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకం తగ్గించేశారు దీంతో ప్రస్తుతం కోళ్ల లభ్యత తగ్గింది. దీనికి తోడు, ప్రస్తుతం చికెన్ కి డిమాండ్ పెరగడంతో కిలో చికెన్ ధర 240 దాటి మాంసప్రియులకు చుక్కలు చూపిస్తోంది. ఇలాఉండగా, గత రెండేళ్ల కాలంలో ఫౌల్ట్రీ రైతులు మాత్రం తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కరోనా ఉపద్రవంతో తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. దీనికి తోడు చికెన్ తినొద్దంటూ వస్తున్న పుకార్లు కూడా ఈ రంగాన్ని పదే పదే కుదేలయ్యేలా చేస్తోంది.

* దేశీయంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరగడం మొదలు పెట్టాయి. స్వలంగా బంగారం ధర పెరిగితే.. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. దేశీయంగా కిలో వెండిపై స్వల్పంగా రూ.280 మేర పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.65,700 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.65,700 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.70,100 ఉండగా, కోల్‌కతాలో కిలో వెండి రూ.65,700 ఉంది, ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.65,400 ఉండగా, హైదరాబాద్‌లో రూ.70,100 ఉంది, ఇక విజయవాడలో కిలో వెండి ధర రూ. 70,100 ఉంది. విశాఖపట్నంలో కిలో వెండి రూ. 70,100 ఉంది. ఇక కేరళలో కిలో వెండి రూ.65,700 ఉండగా, పూణెలో కిలో వెండి రూ.65,700 వద్ద కొనసాగుతోంది.

* గతేడాదిలో చాలా నెలలకు వేతనాన్ని, పనితీరు ఆధారంగా ఇచ్చే బోనస్‌ను బోయింగ్‌ సీఈఓ డేవిడ్‌ కాల్‌హౌన్‌ వదులుకున్నారు. అయితే షేర్ల ప్రయోజనాల (స్టాక్‌ ఆప్షన్స్‌) రూపంలో 21 మిలియన్‌ డాలర్లను ఆయన అందుకున్నట్లు తెలుస్తోంది. రెండు 737 మ్యాక్స్‌ విమానాలు ప్రమాదానికి కారణమవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా బోయింగ్‌ విమానాల సేవలు నిలిచిపోవడం, కరోనా పరిణామాల కారణంగా విమానాలకు గిరాకీ తగ్గిపోవడం లాంటి వాటి కారణంగా కిందటేడాది బోయింగ్‌ ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో బోయింగ్‌ సుమారు 12 బిలియన్‌ డాలర్ల మేర నష్టాన్ని చవిచూసింది. కాల్‌హౌన్‌ 2020 జనవరిలో సీఈఓ అయ్యాక.. మార్చిలో వేతన నిరాకరణ నిర్ణయానికి ముందు కాలానికి 2,69,231 డాలర్ల వేతనాన్ని అందుకున్నారు. అయితే మ్యాక్స్‌ విమానాల సర్వీసులను పునఃప్రారంభమయ్యేలా చేసినందుకు 7 మిలియన్‌ డాలర్లు, బ్లాక్‌స్టోన్స్‌లో తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చినందుకు 10 మిలియన్‌ డాలర్లు, దీర్ఘకాలిక ప్రోత్సాహకాల కింద 3.5 మిలియన్‌ డాలర్ల మేర షేర్ల ప్రయోజనాలు కాల్‌హౌన్‌కు లభించాయి. వచ్చే మూడేళ్ల కాలంలో ఈ షేర్ల ప్రయోజనాలు ఆయన చేతికి వస్తాయి.

* వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2021-22) ప్రైవేటీకరణ ప్రక్రియకు ప్రభుత్వం భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌), ఎయిరిండియాలతో శ్రీకారం చుట్టే అవకాశం కన్పిస్తోంది. జూన్‌-జులైలో వీటి ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తి చేస్తామనే నమ్మకంతో పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్‌) ఉన్నట్లు తెలుస్తోంది. ‘పెట్టుబడుల ఉపసంహరణ నిమిత్తం జాబితాలో చేర్చిన సంస్థలన్నింటిలో ఎయిరిండియా, బీపీసీఎల్‌లో వాటా విక్రయ ప్రక్రియే తుది దశల్లో ఉంది. అందుకే ముందుగా వీటి ప్రైవేటీకరణను పూర్తి చేస్తాం. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికం చివరికల్లా లేదంటే రెండో త్రైమాసికం ప్రారంభంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామ’ని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.