Editorials

జీవితంలో జాగ్రత్త చాలా అవసరం

జీవితంలో జాగ్రత్త చాలా అవసరం

జాగ్రత్త – అజాగ్రత్త , జీవితం విలువలు—//-

మన జాగ్రత్త అజాగ్రత్తలకు కారణం మనం ఇచ్చే విలువల్ని బట్టి ఉంటుంది

మనం దేనికి విలువ ఇస్తామో దానిపట్ల మనం జాగ్రత్తగా ఉంటాము .

మనం దేనికి విలువ ఇవ్వమో దానిపట్ల మనం అజాగ్రత్తగా ఉంటాము .

వస్తువుల పట్ల అయినా మనుషుల పట్ల అయినా, జీవిత విషయాల పట్ల అయినా , అవసరమైన విలువ ఇస్తే వాటిని కోల్పోము..జాగ్రత్తగా ఉంటాము

మనిషికి విలువ ఇస్తే , మనిషి పట్ల జాగ్రత్తగా ఉంటాము..

బంధాలకు విలువ ఇస్తే బంధాలను జాగ్రత్తగా చూసుకుంటాము..

ఆరోగ్యానికి విలువ ఇస్తే ఏమి తినాలో , ఏమి తినకూడదో , ఎంత తినాలో , ఎప్పుడు తినాలో అన్నీ జాగ్రత్తగా ఉంటాము

డబ్బుకు విలువ ఇస్తే ఆచి తూచి ఖర్చు పెడతాము

కాలానికి విలువ ఇస్తే టైం వేస్ట్ చెయ్యము .

మానవ సంబంధాలకు విలువ ఇస్తే వాటిని తెంచుకోము.

దేనికి ఎంత విలువ ఇవ్వాలో తెలుసుకుని వ్యవహరించడం నేర్చుకుంటే , వాటి పట్ల జాగ్రత్తగా ఉంటాము

దేనికీ విలువ ఇవ్వడం తెలియకుంటే , అన్నిటిపట్లా అజాగ్రత్తగానే ఉంటాము

జీవితానికి విలువ ఇచ్చేవారే జీవితం ,విలువను జాగ్రత్తగా వాడుకుంటారు… లేనివారు అజాగ్రత్తలో జీవితం విలువలు తెలియక జీవితంలోని విలువైన వన్నీ కోల్పోతారు—-//-