చిలకడదుంపలు ఇష్టంలేని వాళ్లు ఉండరు. వాటిని ఉడకబెట్టుకుని లేదా కాల్చుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. వీటితో కూర చేయొచ్చు. పులుసుల్లో వాడొచ్చు. స్వీట్లు చేసుకోవచ్చు. వీటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా తక్కువేం కాదు. అవేమిటంటే… చిలకడదుంపల్లో పీచుపదార్థాలు ఎక్కువ ఉన్నాయి.విటమిన్లు, ఖనిజాలు కూడా ఎక్కువ.బెటాకెరొటిన్ యాంటీ ఆక్సిడెంట్లు వీటిల్లో పుష్కలం.ఐరన్, కాల్షియం, సెలీనియం, మెగ్నీషియం, పొటాషియం,విటమిన్-బి, విటమిన్-సిలు ఉన్నాయి.రక్తపోటును క్రమబద్దీకరిస్తుంది.క్యాన్సర్ రిస్కులో పడకుండా రక్షిస్తుంది.ఇవి తింటే మలబద్థకం తగ్గి, జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది.వీటిలోని విటమిన్-సి, టీటాకెరొటిన్ల వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.ఈ దుంపలోని ఖొలైన్ వైవిధ్యమైన పోషకపదార్థం. దీనివల్ల నిద్ర బాగా పడుతుంది. కండరాల కదలికలు బాగా ఉంటాయి.జ్ఞాపకశక్తి పెరుగుతుంది.చిలకడదుంపల్లోని విటమిన్-ఎ, టీటాకెరొటిన్ల వల్ల చూపు బాగుంటుంది.కడుపులో మంటను తగ్గించే పోషకాలు ఇందులో ఉన్నాయి.బ్లడ్ షుగర్‌ను క్రమబద్ధీకరిస్తాయి. ఎనర్జీ పెరుగుతుంది.వీటిల్లోని మెగ్నీషియం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా ఉంటారు.మధుమేహాన్ని క్రమబద్ధీకరిస్తాయి. కడుపులో అల్సర్లను తగ్గిస్తాయి.గుండెజబ్బుల తీవ్రతను తగ్గిస్తాయి.రకరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.బరువు పెరగకుండా సహాయపడతాయి.
ఆస్తమా నుంచి సాంత్వననిస్తాయి. బ్రోంఖైటిస్ నివారణలో తోడ్పడతాయి.ఆర్థరైటిస్ నొప్పులను తగ్గిస్తాయి.వీటిల్లో నీరు బాగా ఉండడం వల్ల డీహైడ్రేషన్ కాకుండా నిలువరిస్తాయి.
చిలకడ దుంపలు బాగా తినాలి
Related tags :