DailyDose

శ్రీచైతన్య విద్యార్థిని ఆత్మహత్య-నేరవార్తలు

శ్రీచైతన్య విద్యార్థిని ఆత్మహత్య-నేరవార్తలు

* శ్రీ చైతన్య గోశాల గర్ల్స్ క్యాంపస్ లో ఇంటర్ 1స్త్ ఇయర్ చదువుతున్న దాసరి లాస్య మృతి..విద్యార్థిని లాస్య హాస్టల్ గదిలోనే ఉరేసుకుని చనిపొయ్యిన శ్రీ చైతన్య యాజమాన్య..విజయవాడ ప్రభుత్వ మార్చురీ లో మృతిదేహాం..ఒక్కగానొక్క కూతురు చనిపోవడంతో హాస్పిటల్ వద్ద గుండెలు అగేల రోదిస్తూన్న తల్లిదండ్రులు.

* కడప జిల్లా పుష్పగిరి ఆలయం సమీపంలోని పెన్నా నదిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు.వివరాల్లోకి వెళ్తే…….మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ముద్దనూరు మండలం థర్మల్‌ గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న కొంతమంది విద్యార్థులు.. వల్లూరు పరిధిలోని పుష్పగిరి పుణ్యక్షేత్రానికి వెళ్లారు.పుష్పగిరి కొండపై వెలసిన సంతాన మల్లేశ్వర స్వామి, చెన్నకేశవులను దర్శించుకున్నారు.అనంతరం కొండ దిగువన పెన్నానదిలో స్నానం చేసేందుకు వెళ్లారు.స్నానం చేస్తున్న క్రమంలో నది లోపలికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు అక్కడ ఊబిలో చిక్కుకుని గల్లంతయ్యారు.గల్లంతైన వారిని కార్తీక్‌, నందకిశోర్‌గా గుర్తించారు.స్థానికంగా ఉన్న ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.

* ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ట్రక్కు, స్కార్పియో పరస్పరం ఢీకొన్న ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు.క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. స్కార్పియోలో ప్రయాణిస్తున్న 12 మంది.. బిహార్​కు చెందిన వారుగా తెలుస్తోంది.

* ఇండోనేసియాలో ఘోర ప్రమాదం జరిగింది. జావా ద్వీపంలో ఓ యాత్రికుల బస్సు లోయలో పడిపోయింది.ఈ ఘటనలో 27మంది మరణించారు. మరో 39మంది గాయపడ్డారు. ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.బస్సు బ్రేకులు పనిచేయకపోవడమే ఘటన జరగడానికి కారణమని తెలుస్తోంది.పశ్చిమ జావా రాష్ట్రంలోని సుబాంగ్​ పట్టణం నుంచి తసిక్​మాలయ జిల్లాకు వెళుతుండగా బస్సు ప్రమాదానికి గురైంది.ఇందులో ఇస్లామ్​ జూనియర్​ హై స్కూల్​ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు.బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతంలో అనేక మలుపులు ఉంటాయని అధికారులు వెల్లడించారు.వాహనంపై డ్రైవర్​ అదుపు కోల్పోవడం వల్ల బస్సు 20 అడుగుల లోయలో పడిపోయిందని స్పష్టం చేశారు.

* జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మాజీమంత్రి రవీంద్రకు వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు.రవీంద్ర నుండి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న వైద్యులు.వైద్య పరీక్షల అనంతరం రవీంద్ర ను జిల్లా కోర్టుకు తరలించిన పోలీసులు.జిల్లా కోర్టు గేట్లు వేసి ఎవ్వరినీ లోనికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.* బుక్కరాయసముద్రం మండలం వడియం పేట వద్ద హోమ్ ని వ్యాన్ అదుపుతప్పి ఒకరు మృతిమరొకరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు.