NRI-NRT

లండన్‌లో టాక్ మహిళా దినోత్సవం

TAUK Celebrates Womens Day In London - UK Telugu News

లండన్ లో ఘనంగా ‘టాక్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం’
– ముఖ్య అతిథిగా సునీత లక్ష్మా రెడ్డి , చైర్ పర్సన్ తెలంగాణ మహిళా కమీషన్

లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆన్ లైన్ ద్వారా ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ తొలి మహిళా కమిషన్ చైర్ పర్సన్ మాజీ మంత్రి సునీతా లక్షారెడ్డి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో యూకే లోని మహిళలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థల మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సునీతా లక్మారెడ్డి మాట్లాడుతూ కార్యక్రమానికి వచ్చిన వారందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి తెలంగాణా ప్రభుత్వం మహిళా సాధికారతకై చేస్తున్న కార్యక్రమాలని వివరించి మహిళలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుందన్నారు. ఆత్మ విశ్వాసం, ధైర్యం ప్రధాన ఆయుధాలుగా ఆడపిల్లలు జీవితంలో ముందుకు సాగాలన్నారు.వచ్చిన అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకున్నప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తారని, ప్రతి అవకాశాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలనీ పురుషుల కన్నా మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలనీ,
దేశాభివృద్ధిలో మహిళలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారనీ, సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం అని అన్నారు.
మహిళలు, అమ్మాయిలకు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వారికి అండగా ఉంటామని అన్నారు.
అలాగే తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ నాయకత్వంలో ప్రత్యేకించి మహిళల సంరక్షణ కొరకు, వారి సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.

ఈ సంధర్భంగా టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది మాట్లాడుతూ టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలని వివరించి తల్లిదండ్రులు ఆడపిల్లలు, అబ్బాయిలను సమానంగా చూడాలనీ, అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలనీ, ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొనేలా వారిలో స్ఫూర్తి నింపాలనీ, నేడు మహిళలు ఒంటరిగా ప్రపంచలో ఎక్కడికైనా వెళ్లగలిగే స్థాయికి ఎదిగారన్నారు. ఎన్నో సంస్థలకు మహిళలు నాయకత్వం వహించి అద్భుత విజయాలు సాధిస్తున్నారని అన్నారు.

ఈ సంధర్భంగా టాక్ ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో నేటి మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురుషులకు ధీటుగా అద్భుత విజయాలు సాధిస్తున్నారనీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల యొక్క సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలకు ప్రతీకగా ప్రపంచం అంతా జరుపుకునేదిగా అభివర్ణించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని స్వాతి రెడ్డి మహిళలను ఉత్తేజ పరుస్తూ పాటలు పాడి అలరించారు. ఈ కార్యక్రమానికి సుప్రజ పులుసు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, సుప్రజ పులుసు, న్యూజీలాండ్ నుండి బ్రాండ్ తెలంగాణ అంబాసిడర్ సునీత విజయ్, క్కువైట్ నుండి నందిని అబాగోని, టాక్ మహిళా విభాగం సభ్యులు జాన్వీ , సుష్మణ, శ్వేతా మహేందర్, ప్రియాంక , మమత , సంధ్య , శోభ, శ్వేత, లక్ష్మి , యూకే లో నివసిస్తున్న ఇతర మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.