Politics

చంద్రబాబుపై మరోసారి కొడాలి బూతుపురాణం

Kodali Nani Slams Chandrababu And Lokesh After Election Results

మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి తగిన గుణపాఠం చెప్పారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన వీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నవారే నాయకులని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబును మళ్లీ ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను సీఎం జగన్ నెరవేర్చారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. ప్రజలకు ఏం కావాలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి తెలుసు అని చెప్పారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని కొడాలి నాని హితవు పలికారు. ఎన్నికలకు ముందు ఒక మాట.. ఎన్నికలైన తర్వాత చంద్రబాబుది మరో మాట ఉంటుందని మండిపడ్డారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని చూసి చంద్రబాబు చాలా నేర్చుకోవాలన్నారు. చంద్రబాబుకు సిగ్గుంటే కృష్ణా జిల్లాలో అడుగు పెట్టకూడదని అన్నారు. అమరావతిలో ఉన్న రైతులను చంద్రబాబు రోడ్డుపైకి తెచ్చారని కొడాలి నాని మండిపడ్డారు.మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు చూశారని కొడాలి నాని మండిపడ్డారు. ఇప్పటికైనా దొంగల్ని వదిలేసి అమరావతి ప్రజలు ఆలోచించాలన్నారు. ఎల్లో మీడియాలో వస్తున్న విష ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అమరావతి ప్రాంతానికి ఏం కావాలో సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లండిని తెలిపారు. హైదరాబాద్‌లో చంద్రబాబు, లోకేష్ పాచిపనులు చేస్తున్నారా అని ప్రశ్నించారు. కుల, మత, పార్టీలు లేకుండా అందరినీ సీఎం జగన్ సమానంగా చూస్తున్నారని గుర్తుచేశారు. పేద ప్రజలకు సమానంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని తెలిపారు. దొంగ మాటలు చెప్పి ఎన్నికల్లో లబ్ది పొందాలని చంద్రబాబు చూశారని కొడాలి నాని మండిపడ్డారు. నీచ రాజకీయాలు చేసే బాబు మున్సిపల్‌ ఫలితాలపై ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, బీజేపీ, ఎల్లో మీడియా కలిసి ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మలేదని తెలిపారు.