* బాట్లా హౌస్ ఎన్కౌంటర్ కేసులో అరిజ్ ఖాన్‌కు ఉరిశిక్షదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 ‘బాట్లా హౌస్ ఎన్కౌంటర్’ కేసులో దోషిగా తేలిన అరిజ్ ఖాన్‌కు ఉరిశిక్ష విధించింది దిల్లీ కోర్టు.ఈ కేసును అత్యంత అరుదైనదిగా అభిప్రాయపడింది. ఉరిశిక్షతో పాటు మొత్తం రూ.11 లక్షల జరిమానా విధించింది.2008లో జరిగిన ఈ ఘటనలో ఇన్స్పెక్టర్ మోహన్ చంద్ శర్మ(ఎంసీ శర్మ)ను అరిజ్ ఖాన్, అతని సహచరులు హత్యచేసినట్టు సాక్ష్యాధారాలతో సహా నిరూపితమైందని ఈనెల 8న తీర్పు వెలువరించింది దిల్లీ కోర్టు.అయితే.. ఏ శిక్ష విధించాలనే అంశంపై మార్చి 15న విచారిస్తామని తెలిపింది.ఈ క్రమంలో సోమవారం విచారించిన న్యాయస్థానం ఉరి శిక్షను ఖరారు చేసింది.2008లో దిల్లీలో ఇండియన్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో జామియా నగర్‌లోని బాట్లా హౌస్ ప్రాంతంలో దిల్లీ పోలీసులు కాల్పులు జరిపారు.పోలీసులపై ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు దిగడం వల్ల ఇన్స్పెక్టర్ ఎంసీ శర్మ అమరుడయ్యారు.అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.అయితే ఈ కేసుతో సంబంధమున్న ఉగ్రవాది షాజాద్ అహ్మద్‌కు 2013 జులైలో జీవిత ఖైదు విధించింది ట్రయల్ కోర్టు.ఆ తర్వాత 2018లో ప్రధాన నిందితుడు అరిజ్‌ఖాన్‌ను అరెస్ట్ చేశారు దిల్లీ పోలీసులు.
* మల్లెంపూడిలో 6 సంవత్సరాల బాలుడు భార్గవ్ తేజను ఇంటి దగ్గర లోని పొదలలో చంపి పడవేసిన గుర్తుతెలియని వ్యక్తులు.
* సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 18న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలకు సంబంధించిన శాఖాపరమైన విచారణ ప్రారంభం కానుంది.కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్.. ఆర్పీ సిసోడియా నేతృత్వంలో సచివాలయంలో అభియోగాలపై విచారణ జరగనుంది.ఏబీపై శాఖాపరమైన విచారణను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించటంతో విచారణ ప్రారంభం కానుంది.ఏబీ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం రోజువారీ విచారణను చేపట్టాలని విచారణాధికారి (కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్)ని ఆదేశించింది.విచారణ నివేదికను మే 3 నాటికి కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చేపట్టే విచారణను ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో చేపట్టాలని ఏబీ వెంకటేశ్వరరావు అభ్యర్థించారు.
* బిహార్ రాష్ట్రం కిషన్‌గంజ్ జిల్లా సలామ్‌నగర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* ఆటోను కంటైనర్ ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అందోలు మండలం అల్మాయిపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. సంగారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.