అమెరికాలో భారతీయులకు చిరకాల స్వపనం గ్రీన్ కార్డు పొందటం. తద్వారా మెరుగైన ఉద్యోగవకాశాలు అందుకునే సౌకర్యాన్ని పొందుతారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో H1 కలిగి ఉన్న భాగస్వామి I-140 దరఖాస్తు ఆమోదం కలిగి ఉన్నట్లు అయితే H4 పైన ఉన్న వారి భాగస్వామికి EAD ఇచ్చే విధంగా నిబంధన తీసుకువచ్చారు. ఈ నిర్ణయంతో ఎన్నో దశాబ్దాలుగా గ్రీన్ కార్డ్ కోసం నిరీక్షిస్తున్న భారతీయుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపినట్లు అయింది. కానీ ట్రంప్ రాకతో మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడినప్పటికీ ఇప్పటికీ H4-EADపై చాలా మంది భారతీయ భాగస్వామ్యులు ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణిస్తున్నారు. H4-EAD దరఖాస్తును అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం USCIS C26గా పరిగణిస్తుంది. (USCIS Does Not Include C26 For Automatic Extension)
అమెరికాలో H4-EAD గాక గ్రీన్ కార్డ్ EAD కూడా అందుబాటులో ఉంది. ఈ గ్రీన్ కార్డ్ EAD కాలపరిమితి అయిపోయాక రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకున్నాక మరో 180రోజులకు వెసులుబాటు ఉంది. ఈ సౌకర్యం H4-EAD దరఖాస్తుదారులకు అందుబాటులో లేదు. ఈ సమస్యపై పోరాడేందుకు 2021 తానా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న నిరంజన్ శృంగవరపు పలువురు అమెరికా కాంగ్రెస్ సభ్యులు, న్యాయ కోవిదులతో ఓ సదస్సు నిర్వహించారు.
మిషిగన్‌కు చెందిన బోమన్, మేరీల్యాండ్‌కు చెందిన మూర్తి న్యాయ కార్యాలయ సిబ్బందితో పాటు పలువుర్ కాంగ్రెస్ సభ్యుల కార్యాలయ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. H4-EAD దరఖాస్తుదారులు రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకున్నాక నిర్ణీత గడువులో వారి దరఖాస్తు రెన్యూవల్‌కు నోచుకోకపోతే వీరు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, వ్యాపారాలు స్థాపించిన వారు తమ వ్యాపారాన్ని మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని, ఈ సమస్యను అధిగమించడానికి గ్రీన్ కార్డ్ EAD తరహాలో H4-EADకు కూడా 180రోజుల వెసులుబాటు కల్పించాలని నిరంజన్ ఈ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులకు విన్నవించారు. ఈ మేరకు వచ్చే వారం నిరంతరంగా పలువురు కాంగ్రెస్ సభ్యులు, న్యాయ కోవిదులతో సెమినార్లు చర్చిస్తున్నామని, భారతీయులకు ఈ నిబంధన ఉపయుక్తమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కొల్లా అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
################