Politics

హైదరాబాద్ ఎమ్మెల్సీగా పీవీ వాణీ విజయం-తాజావార్తలు

హైదరాబాద్ ఎమ్మెల్సీగా పీవీ వాణీ విజయం-తాజావార్తలు - PV Narasimha Rao's Daughter Surabhi Vanidevi Wins As Hyd MLC

* హైదరాబాద్ ఎమ్మెల్సీగా పీవీ వాణీ విజయం. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి విజయం – బీజేపీ అభ్యర్థి రామచందరరావుపై గెలుపొందిన వాణీదేవి – కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్న ఎన్నికల అధికారులు…..Trs -149289. Bjp -137566. మెజారిటీ 11703

* దిల్లీలో భారత్, అమెరికా రక్షణ మంత్రుల అత్యున్నత స్థాయి సమావేశం శనివారం ముగిసింది.రక్షణ మంత్రులు రాజ్​నాథ్ సింగ్, లాయిడ్ జేమ్స్​ ఆస్టిన్ ఉన్నతాధికారులతో కలిసి భేటీ అయ్యారు.ఆస్టిన్​తో అద్భుతమైన, ఫలప్రద చర్చలు జరిగాయని రాజ్​నాథ్ పేర్కొన్నారు.

* దేశంలోని ధనిక ప్రాంతీయ పార్టీల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ, టీఆర్‌ఎస్‌, వైసీపీలు నిలిచాయి. 2018-19 సంవత్సరానికిగాను దేశంలో టాప్‌ 10 పార్టీలతో కూడిన జాబితాను ది అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌(ఏడీఆర్‌) విడుదల చేసింది. రూ.193 కోట్ల ఆస్తులతో టీడీపీ నాలుగో స్థానంలో, రూ.188 కోట్ల ఆస్తులతో టీఆర్‌ఎస్‌ ఆరో స్థానంలో, రూ.93 కోట్ల ఆస్తులతో వైసీపీ 8వ స్థానంలో నిలిచాయి. దేశంలో అత్యంత ఎక్కువ ఆస్తులున్న పార్టీ సమాజ్‌వాదీనే. ఆ పార్టీ.. రూ.572 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా నవీన్‌ పట్నాయక్‌ సారథ్యంలోని బీజేడీ రూ.232 కోట్లతో 2వ స్థానంలో ఉంది. తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే రూ.206 కోట్లతో మూ డో స్థానంలో నిలిచింది. టీడీపీకి రూ.115 కోట్లు, TRSకు రూ.152 కోట్లు, వైసీపీకి రూ.79 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి.

* తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ను తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం కలిశారు. శాసన సభ సమావేశాల సందర్భంగా బిజీగా ఉన్న కేటీఆర్‌తో అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు తెలపడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయనను కలిసినట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రులతో కలిసి ఓ బృందంగా విశాఖకు వస్తామని కేటీఆర్ చెప్పినట్లు గంటా పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతానని గంటా ఆ సందర్భంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు అందరి మద్దతును కూడగడుతున్నారు.

* సాహితీ కళా సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బహద్దూర్ లింగారెడ్డి కి సాహితీ రత్న పురస్కారం ప్రదానం చేశారు. హైదరాబాద్ తిలక్ రోడ్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ లో నిర్వహించిన మహిళా కౌముది, సాహితిరత్న నృత్య రత్న పురస్కారాల ప్రదానోత్సవంలో గౌతంనగర్ డివిజన్ జ్యోతినగర్ కు చెందిన లింగారెడ్డికి ఈ పురస్కారాన్ని అందించారు. ప్రముఖ సినీ దర్శకులు బాబ్జీ , నవ్యంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు కళా రత్న బిక్కి కృష్ణ, స్పందన ఇదా ఫౌండేషన్ చైర్మన్ శామ్యూల్ రెడ్డి , తుమ్మలపల్లి సత్యనారాయణ, డాక్టర్ విజయలక్ష్మి పండిట్, గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ చైర్మన్ గిడుగు లక్ష్మి కాంతి , లక్ష్మణ్, వాసిరెడ్డి మల్లేశ్వరి, మల్లెల బాబు రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

* భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియా తన మంచి మనసును చాటుకున్నారు.మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ప్రయాణిస్తుండగా, ఆయన కాన్వాయ్‌లోని ఓ పోలీసు ప్రమాదవశాత్తు వాహనం నుంచి కింద పడిపోయారు.ఈ సమయంలో వాహనం దిగి వచ్చిన సింధియా తన చేతి రుమాలును అడ్డుపెట్టి కానిస్టేబుల్‌కు రక్తస్రావం కాకుండా సాయం చేశారు.అనంతరం ఆసుపత్రికి తరలించారు.

* రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్​ఎస్​ఎస్) సర్​ కార్యవాహ్​(జనరల్​ సెక్రటరీ)గా ఎంపికయ్యారు దత్తాత్రేయ హోసబలే.బెంగుళూరు వేదికగా జరుగుతోన్న అఖిల భారతీయ ప్రతినిధి సభలో హోసబలేను జనరల్ సెక్రటరీగా ఎన్నుకన్నట్లు ఆర్​ఎస్​ఎస్​ తమ ట్విటర్ ఖాతాలో పేర్కొంది.2009 నుంచి ఈయన సంఘ్​ సహ సర్​ కార్యవాహ్​గా ఉన్నట్లు పేర్కొంది.శివమొగ్గకు చెందిన హోసబలే గత జనరల్​ సెక్రటరీ సురేష్ భయ్యాజీ జోషీ స్థానాన్ని భర్తీ చేయనున్నారు.1968లో ఈయన సంఘ్​లో చేరారు. కన్నడ మ్యాగజైన్ అసీమాకు ఎడిటర్​గాను పనిచేశారు.1975-1977 ఎమర్జెన్సీ సమయంలో 16 నెలల పాటు హోసబలే జైలు జీవితం గడిపారు.

* బంగాల్​లో భాజపా మాత్రమే నిజమైన పార్టీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర పథకాలు రాష్ట్రానికి రాకుండా మమతా బెనర్జీ అడ్డుగోడలా నిల్చున్నారని ధ్వజమెత్తారు.

* రెండు రోజుల క్రితం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్న పాకిస్థాన్ ప్రధాని తాజాగా కరోనా బారినపడడం కలకలం రేపుతోంది.ఇమ్రాన్‌ఖాన్‌కు కరోనా వైరస్ సంక్రమించినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫైసల్ సుల్తాన్ శనివారం వెల్లడించారు.

* సోనూసూద్‌ చేసిన సేవలకు గౌరవంగా దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూసూద్ బొమ్మను వేశారు.ఏ సెల్యూట్ టూ సేవియర్ సోనూసూద్ అనే క్యాప్షన్ వేశారు.ఇలా దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తికి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే తొలిసారి.లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్, స్పైస్ జెట్ సంస్థ సంయుక్తంగా పూనుకుని 2.5 లక్షల మంది భారతీయులను స్వస్థలాలకు చేర్చారు.

* ముంబైలోని అతిపెద్ద మురికివాడ ధారావిలో కరోనా మహమ్మారి మరోసారి విశ్వరూపం దాల్చుతోంది.ఫిబ్రవరితో పోల్చితే మార్చిలో కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 62 శాతం పెరిగినట్టు ఇవాళ అధికారులు వెల్లడించారు.ఫిబ్రవరిలో ఇక్కడ మొత్తం 168 కేసులు నమోదు కాగా.. మార్చిలో ఇప్పటి వరకు 272 మంది కరోనా బారిన పడ్డారు.2.5 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలోని ఈ మురికివాడలో కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

* ఏప్రిల్ నుంచి పెరగనున్న ఔషధాల ధరలు.ప్రభుత్వం ఔషధ కంపెనీలకు యాన్యువల్ హోల్‌సేల్ ప్రైస్‌లో 0.5 శాతం పెంచుకునేందుకు అనుమతిచ్చిందని నేషనల్ ఫార్మాసూటికల్ ప్రాసెసింగ్ అథారిటీ ప్రకటించింది.ఈ మేరకు నొప్పి నివారణ మందులు, యాంటీఫ్లాటివ్, కార్డియాక్, యాంటీబయోటిక్స్‌ తో పాటు ఇతర ఔషధాల ధరలు ఏప్రిల్ నుంచి పెరగనున్నాయి.ప్రభుత్వం ఔషధ తయారీ కంపెనీలకు యాన్యువల్ హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యుపీఐ) ఆధారంగా ధరలలో మార్పులు చేసేందుకు అనుమతినిచ్చింది.