DailyDose

పాల్వంచ తహశీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడి-నేరవార్తలు

Crime News - ACB Raids Palvancha Tahasildar Office

* కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు రూ.3,500 లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పాల్వంచ తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆనంద్‌ మోహన్‌ చక్రవర్తి పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి కోట అరుణ్‌సాయి ఫ్యామిలీ మెంబర్ల సర్టిఫికెట్‌ కోసం గత ఫిబ్రవరి 12న మీ సేవ కేంద్రం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి సర్టిఫికెట్‌ కోసం తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినా అధికారులు స్పందించడంలేదు. సర్టిఫికెట్‌ ఇవ్వాలంటే కొంత ముట్టజెప్పాలంటూ జూనియర్‌ అసిస్టెంట్‌ ఆనంద్‌ మోహన్‌ చక్రవర్తి వేధించాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధకశాఖ( ఏసీబీ) అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు శనివారం తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఆనంద్‌కు రూ.3,500 లంచం ఇచ్చాడు. అప్పటికే నిఘావేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండడ్‌గా పట్టుకున్నారు. అవినీతికి పాల్పడిన ఆనంద్‌పై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ ఖమ్మం ఇన్‌చార్జి డీఎస్పీ మధుసూదన్‌ తెలిపారు. దాడిలో ఖమ్మం ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు రమణమూర్తి, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

* విశాఖ జిల్లా మాకవరపాలెం సమీపంలోని పిపి ఆగ్రహారం వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పదోతరగతి విద్యార్థులు మృతి చెందారు. మాకవరపాలెంనకు చెందిన ఆర్‌.హేమంత్‌ అనే విద్యార్థి ఇంట్లో శుభకార్యం నిమిత్తం తన స్నేహితులు అవినాష్‌, హర్షిత్‌తో కలిసి వీరు ద్విచక్రవాహనంపై శనివారం అర్ధరాత్రి పయనమయ్యారు.

* ములుగు జిల్లాలోని పందికుంట క్రాస్‌ రోడ్డు వద్ద ఆదివారం ప్రమాదం జరిగింది. నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ కంట్రోలర్‌ సదానందం, మహిళా కండక్టర్‌ సునీత విధులకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై నర్సంపేట డిపోకు వెళ్తుండగా పందికుంట క్రాస్‌రోడ్‌ వద్ద వెనుక నుంచి డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* తుపాకీతో బంగారం వ్యాపారిని బెదిరించిన ఆర్మీ జవాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వివరాలను విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పార్వతీపురం మండలం చినబంటువలస గ్రామానికి చెందిన సీహెచ్‌ రాజేశ్వరరావు ఉత్తరప్రదేశ్‌లో ఆర్మీజవానుగా పనిచేస్తున్నాడు. ఇటీవల సెలవుపై సొంతూరుకు వచ్చాడు. గతంలో భూ వ్యవహారానికి సంబంధించి రూ.22 లక్షలను రాజేశ్వరావు నష్టపోయాడు. పోగొట్టుకున్న డబ్బును సంపాదించేందుకు అడ్డదారులు ఎంచుకున్నాడు.

* తనపై అత్యాచారం చేయాలనుకున్న ఓ దుర్మార్గుడికి తగిన రీతిలో బుద్ధి చెప్పింది మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ. అఘాయిత్యానికి పాల్పడేందుకు ఇంట్లోకి చొరబడిన వ్యక్తి మర్మాంగాన్ని కోసేసింది. సీధీÅ జిల్లాలోని ఉమరియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. గురువారం రాత్రి 11 గంటలకు ఈ ఉదంతం జరిగిందని ఖాదీ ప్రాంత ఎస్సై ధర్మేంద్ర సింగ్‌ రాజ్‌పుత్‌ తెలిపారు.

* ప్రేమ ఫలించకపోవడంతో ఓ వ్యక్తి ఉన్మాదిగా మారాడు. పెళ్లికి నిరాకరించిన దంపతులు, మనుమరాలిపైనా కత్తి దూసాడు. తమిళనాడులో తిరునెల్వేలి జిల్లా తిరుక్కురుంగుడిలో రసూల్‌రాజ్‌ (52) మతబోధకుడిగా ఉన్నారు. ఇతని భార్య ఎప్సిబాయ్‌ (52). ఈ దంపతులకు ఐదుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహమై భర్తతో కలసి విదేశాల్లో ఉంటున్నారు. వీరి 8నెలల చిన్నారి కుయాన్సీని రసూల్‌ దంపతులు పెంచుతున్నారు. దంపతుల నాల్గో కుమార్తె కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈమెను రోస్మీపురానికి చెందిన శివశంకరన్‌ (25) ప్రేమిస్తున్నానంటూ కొంతకాలంగా వెంటపడుతున్నాడు. ఆ యువకుడి తల్లిదండ్రులు పెళ్లి విషయమై రసూల్‌రాజ్‌ను కలుసుకోగా రసూల్‌దంపతులు నిరాకరించారు. దీంతో కక్ష పెంచుకున్న శివశంకరన్‌ శనివారం తెల్లవారుజామున వేట కొడవలి, పెట్రోల్‌ క్యాన్‌తో రసూల్‌రాజ్‌ ఇంట్లోకి వచ్చి రసూల్‌రాజ్, ఎప్సీబాయ్, చిన్నారి కుయాన్సీని నరికాడు.