తానా 2021 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వారాంతం నార్త్ కరోలినా రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేసిన నిరంజన్ శృంగవరపు ప్యానెల్ తమ పర్యటనను ఆదివారం సాయంత్రం షార్లెట్ కార్యక్రమంతో ముగించింది. షార్లెట్ సమీపంలోని కాన్కర్డ్లో జరిగిన ఈ కార్యక్రమంలో నిరమజన్ తన ప్యానెల్ సభ్యులతో కలిసి పాల్గొని ప్రవాస ఓటర్ల మద్దతును అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్యానెల్ సభ్యులతో పాటు తానా తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
############