Business

ప్రస్తుత సమయంలో బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చా-వాణిజ్యం

Business News - Can you invest in gold during these times?

* ఆర్థిక సంక్షోభంలో ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా పసిడికి పేరుంది. కరోనా సంక్షోభ సమయంలో ఈక్విటీలు, ఎక్కువరాబడి ఇచ్చే ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్ల వంటి విలువ భారీగా పడిపోయింది. పసిడి ధరలు మాత్రం కొత్త గరిష్ఠాలకు చేరాయి. అయితే, అనేక కారణాలతో అవి మెల్లగా కిందకు దిగొచ్చాయి. దీంతో ఇప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టొచ్చా? అన్న ప్రశ్న సామాన్య మదుపర్లను వెంటాడుతోంది.ధరలు ఎందుకు తగ్గాయి?…..బంగారం ధరల్ని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల దగ్గర నుంచి స్థానిక గిరాకీ వరకు చాలా అంశాలు పసిడి ధరల్ని నిర్ణయిస్తాయి. అయితే, అమెరికా డాలర్‌ బలపడడం, బాండ్ల ప్రతి ఫలాలు ఎగబాకడం తాజాగా బంగారం ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం. అలాగే కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థలు క్రమంగా గాడిలోకి వస్తుండడంతో బంగారంతో పోలిస్తే కాస్త నష్టభయాలు ఎక్కువ ఉన్నప్పటికీ.. ఈక్విటీ, డెట్‌, మ్యూచువల్‌ ఫండ్ల వైపు మదుపర్లు మొగ్గుచూపుతున్నారు. ఇది కూడా పసిడి ధరలకు కళ్లె వేస్తున్న కారణాల్లో ముఖ్యమైనది. కొవిడ్‌ సంక్షోభ సమయంలో కొత్త గరిష్ఠాలకు చేరిన పుత్తడి ధరలు.. వ్యాక్సినేషన్‌ మొదలయ్యాక దాదాపు 20 శాతం మేర తగ్గాయి.పెట్టుబడి పెట్టొచ్చా..?……నిజానికి బంగారంపై పెట్టుబడి పెట్టడం అనేది మదుపర్ల వ్యక్తిగత అవసరాలు, భవిష్యత్‌ లక్ష్యాలు, రిస్క్‌ తీసుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. అయితే, సాధారణంగా పెట్టుబడి పెట్టడానికి ముందు మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా కదలాడుతుంటాయనే దానిపై అవగాహన ఉంటే మంచిది.* బంగారం ధరల్ని సరఫరా-గిరాకీ సూత్రం, భౌగోళిక రాజకీయాలు, డాలర్‌ విలువ, చమురు ధరల వంటి అంశాలు ప్రభావితం చేస్తాయి. ఆర్థిక వ్యవస్థలోకి ద్రవ్యలభ్యత, పసిడి వాస్తవిక విలువకు మార్కెట్‌ ధరలకు సంబంధం ఉండకపోవచ్చు. అందుకే, ఒక్కోసారి బంగారం ధరల్లో చాలా కాలం పాటు ఎలాంటి మార్పూ ఉండదు. ఒక్కోసారి హఠాత్తుగా పెరిగిపోతుంటాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. ఏ సమయంలో బంగారంలోకి పెట్టుబడులు మళ్లిస్తే మంచి రాబడి వస్తుందో అంచనా వేయాలి. అయితే, ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఓ రాయి వేసి చూద్దాం అన్నట్లుగా కాకుండా మీ అవసరాలు, లక్ష్యాలననుసరించి పెట్టుబడులు పెట్టాలా?లేదా? అన్నదానిపై ముందుకు వెళ్లండి.* అలాగే బంగారాన్ని భౌతికంగా కొనడానికి బదులు పసిడి బాండ్లు, గోల్డ్‌ ఈటీఎఫ్‌ వంటి ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి సారించాలి. వీటిలో మదుపు చేయడం వల్ల కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.

* రేషన్‌ డోర్‌ డెలివరీ వల్ల తమకు కలిగిన నష్టంపై కోర్టును ఆశ్రయించాలని రేషన్‌ డీలర్లు నిర్ణయించారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం చూపకుండా నేరుగా డోర్‌ డెలివరీ విధానం ప్రవేశపెట్టడం వల్ల నాన్‌-పీడీఎస్‌ ఆదాయం కోల్పోయామని, ఇది చట్ట విరుద్ధమని, దీనిపై కోర్టును ఆశ్రయించనున్నామని వారు వెల్లడించారు. ఆదివారం విజయవాడలో రాష్ట్ర రేషన్‌ డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు దివి లీలామాధవరావు, తెలంగాణ డీలర్ల సంఘం అధ్యక్షుడు, ఇతర ప్రతినిధులు కందుల బాపూజీ, కామిరెడ్డి నాని సమావేశం నిర్వహించారు. డోర్‌ డెలివరీ విధానం అమల్లోకి వచ్చాక డీలర్లకు జరుగుతున్న నష్టాలపై చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ… తమ సమస్యలపై చర్చించడానికి త్వరలోనే మరో సమావేశం నిర్వహించి ఆందోళనకు దిగుతామని తెలిపారు.

* రిలయన్స్‌తో ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లరాదంటూ ఫ్యూచర్‌ రిటైల్‌కు దిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలపై అదే కోర్టులోని ఉన్నత ధర్మాసనం స్టే విధించింది. అలాగే ఫ్యూచర్‌ గ్రూప్‌ సీఈవో కిశోర్ బియానీ సహా ఇత‌రుల ఆస్తుల‌ను జ‌ప్తు చేయాల‌న్న ఉత్తర్వులను సైతం నిలిపివేసింది. ఫ్యూచర్‌-రిలయన్స్‌ ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ కోర్టుని ఆశ్రయించిన అమెజాన్‌కు నోటీసులు జారీ చేసింది. ఏక సభ్య ధర్మాసనం తీర్పును సవాలు చేస్తూ ఫ్యూచర్‌ గ్రూప్‌ శనివారం దిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్‌ డి.ఎన్‌.పటేల్‌, జస్మీత్‌ సింగ్‌తో కూడిన ధర్మాసనం నేడు విచారణ జరిపింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 30కి వాయిదా వేసింది.

* విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ భారత్‌లో కొత్త ఎస్‌5 స్పోర్ట్‌బ్యాక్‌ కారును సోమవారం విడుదల చేసింది. లగ్జరీ సెడాన్‌ సెగ్మెంట్‌లో వస్తున్న ఈ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ ధరను రూ.79.06 లక్షలుగా (ఎక్స్‌షోరూం) నిర్ణయించారు. ఎస్‌5 స్పోర్ట్‌ బ్యాక్‌ను 2017లోనే భారత్‌కు తీసుకొచ్చారు. తాజాగా దీనిలో మరిన్ని అత్యాధునిక ఫీచర్లు జోడిండచడంతో పాటు ఔటర్‌ డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు కారు మరింత స్పోర్టీ లుక్‌ను సంతరించుకుంది. షార్పర్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్‌ఎల్‌లు అదనపు ఆకర్షణ. యాంగులర్‌ బంపర్‌, క్వాడ్‌ టిప్‌ ఎగ్జాస్ట్‌లు, 19 అంగుళాల అలాయ్ వీల్స్‌, స్పాయిలర్‌తో.. కొత్త ఎస్‌5 స్పోర్ట్‌బ్యాక్‌ ఆకట్టుకుంటోంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌ను నష్టాల్లో ముగించాయి. ఉదయమే ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగాయి. అయితే చివరిలో కీలక కంపెనీల షేర్ల దన్నుతో ఇంట్రాడే కనిష్ఠాల నుంచి కోలుకోగలిగాయి. ఉదయం 49,878 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ 49,281 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం 49,878 వద్ద గరిష్ఠానికి చేరింది. చివరకు 86 పాయింట్లు నష్టపోయి 49,771 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 14,736 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజులో 14,763-14,597 మధ్య కదలాడింది. చివరకు 7 పాయింట్ల స్వల్ప నష్టంతో 14,736 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.36 వద్ద నిలిచింది.