పజిల్స్ ఛేదించే అలవాటు ఉంటే మతిమరపు త్వరగా రాదనీ, మెదడు చురుగ్గా మారుతుందనీ, మానసిక సమస్యలు తగ్గుతాయనీ పరిశోధనలు నిరూపించాయి. ఇప్పుడు ప్రహేళికలతో మరో విశేషమైన ఫలితం కనిపించింది. ఒకవేళ మనం ఏదన్నా పజిల్ని చేయలేకపోతే, మన మెదడు స్పందన ఎలా ఉంటుందో గమనించే ప్రయత్నం చేశారు వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు. దీనికోసం రెండువందల మంది అభ్యర్థులను ఎంచుకున్నారు. వారికి ఓ పజిల్ ఇచ్చి, ఆ సమయంలో మెదడు తీరును గమనించేందుకు ఎమ్ఆర్ఐ స్కానర్లను అమర్చారు. ఆశ్చర్యంగా, పజిల్‌ను పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురైనప్పుడు.. మెదడు ఆ దారిని వదిలేసి, సరికొత్త దారిలో దాన్ని ఛేదించే ప్రయత్నం చేసిందట. విఫలమైన ప్రతిసారీ, ఓ కొత్త మార్గాన్ని అన్వేషించిందట. అనవసరమైన మార్గాన్ని పక్కన పెట్టేసిందట. నిజజీవిత సమస్యలను పరిష్కరించడానికి, ప్రహేళికలు ఓ మానసిక వ్యాయామంలా ఉపయోగపడుతున్నాయన్నమాట!
పిల్లలకు పజిల్స్ మంచివి
Related tags :