Politics

రేవంత్ రెడ్డికి కరోనా-తాజావార్తలు

Revanth Reddy Tested Positive For COVID

* రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్.మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని రేవంత్ తెలిపారు.డాక్టర్ల సూచన మేరకు ఐసోలేషన్‌లోకి వెళుతున్నట్టు ట్వీట్ చేశారు.గత కొన్ని రోజులుగా తనతో పాటు ఉన్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ సూచించారు.

* ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు జరిపేలా ఎస్ఈసీని ఆదేశించాలని కోరుతూ పిటిషన్లపై విచారణ.– మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ .– ఎన్నికలు జరపాలని ఆదేశించలేమన్న హైకోర్టు ధర్మాసనం .– కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు .– తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసిన హైకోర్టు.

* కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో ముందోస్తు జాగ్రత్తలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం…కరోనా కట్టడి చేయడానికిప్రత్యేకంగా ద్రుష్టి పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు…విజయవాడ లోని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి క్యాంపు ఆఫీస్ లో అత్యవసరంగా సమావేశం అయిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని… రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాధ్ దాస్,రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులు అనిల్ కుమార్ సింఘాల్, ముద్దాడ రవి చంద్ర, కాటంనేని భాస్కర్, కార్తికేయ మిశ్రా…ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణ, వ్యాక్సినేషన్ వేగవంతం తీసుకోవలసిన చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించిన మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి.

* విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పోరాట వేదిక, రైతు సంఘాలు ఈనెల 26న తలపెట్టిన భారత్ బంద్​కు తెదేపా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు బంద్​లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కర్షక, కార్మిక, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో తెదేపా ఏనాడూ వెనుకంజ వేయదని స్పష్టం చేశారు. ఉక్కు ప్రైవేటీకరణకు పార్లమెంట్ సాక్షిగా కేంద్రం అడుగులు వేస్తుంటే వైకాపా ఎంపీలు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్, కార్మికుల జీవితాలపై వైకాపాకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే రాజీనామాలు చేసి పోరాటానికి రావాలని సవాల్‌ విసిరారు. నయవంచనకు, నమ్మక ద్రోహానికి వైకాపా మారుపేరని దుయ్యబట్టారు. దేశానికి గర్వకారణమైన విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత జగన్​పైన లేదా అని నిలదీశారు.

* తమిళనాడులో విజృంభిస్తున్న కరోనా వైరస్. నలుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్యనేతలకు కరోనా. ఎంఎన్ఎం లో ఇద్దరు, డీఎంకేలో ఇద్దరు అభ్యర్థులకు కరోనా పాజిటివ్. ఎన్నికల ప్రచారానికి వెనకడుగు వేస్తున్న అభ్యర్థులు. ఇప్పటికే కరోనా కారణంగా విద్యాసంస్థలు మూసివేత.

* అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్‌లో గుర్తు తెలియని దుండగుడు ఓ సూపర్‌ మర్కెట్‌లోకి చొరబడి వినియోగదారులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పదిమంది మృతి చెందారు. కాల్పుల శబ్దాలతో భయాందోళనకు గురైన స్టోర్‌లోని వినియోగదారులు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అమెరికాలో వారం రోజుల వ్యవధిలో కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం ఇది రెండోసారి..పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘బౌల్డర్‌లోని కింగ్‌ సూపర్‌ మార్కెట్‌లోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడి కాల్పులకు పాల్పడ్డాడు. సోమవారం మధ్యాహ్నం 2.30గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
కాల్పుల్లో పోలీసు అధికారి సహా మొత్తం 10 మంది మృతి చెందారు.

* ఇసుక ప్రైవేటీకరణను నిరసిస్తూ భాజపా నేతలు తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇసుకను కిలోల లెక్కన తూకం వేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఇసుక టెండర్లను రద్దు చేయాలని నినాదాలు చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ నేతలు ఆదినారాయణ రెడ్డి, భానుప్రకాశ్‌రెడ్డి పెద్దసంఖ్యలో కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఎలాంటి ఆందోళనలు చేయొద్దని పోలీసులు నోటీసులిచ్చినా.. పట్టించుకోకుండా భాజపా నేతలు నిరసన కొనసాగించారు.

* త్వరలో రాష్ట్రం మొత్తానికి సాగునీరు అందిస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ ఉదయం కూడవెళ్లి వాగుకు మంత్రి గోదావరి జలాలను విడుదల చేశారు. ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చిన అనంతరం కొడకండ్ల వద్ద కొండపోచమ్మ కాల్వ నుంచి కూడవెళ్లి వాగుకు నీటిని విడుదల చేశారు. మల్లన్న సాగర్‌ కాల్వ నుంచి కూడవెళ్లి వాగుకు అనుసంధాన కాలువ ద్వారా జలాలు తరలుతున్నాయి. ప్రస్తుతం విడుదల చేసిన నీటితో 12 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని హరీశ్‌రావు తెలిపారు.

* కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో..టీకా కార్యక్రమం కింద కేంద్రం మరో ప్రాధాన్య సమూహాన్ని చేర్చింది. 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు వారికి ఏప్రిల్‌ ఒకటి నుంచి టీకాలు అందించనున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కరోనా టీకా కార్యక్రమం కింద మొదటి దశలో పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి టీకాలు పంపిణీ చేస్తోంది. రెండో దశలో 60 ఏళ్లు దాటిన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న 45 నుంచి 59 సంవత్సరాల వారికి టీకాలు ఇస్తున్నారు.

* గవర్నర్‌కు తాను రాసిన లేఖల లీకేజీపై సీబీఐ విచారణ కోరుతూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన నోటీసులపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. న్యాయస్థానం ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని.. నోటీసులకు సమాధానమిస్తామని చెప్పారు. అమరావతిలో మీడియాతో బొత్స మాట్లాడారు. నిమ్మగడ్డకు సంబంధించిన ఏం రహస్యాలు బయటకు వచ్చాయో తనకైతే అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధ ప్రక్రియలో రహస్యాలెందుకని ఆయన ప్రశ్నించారు.

* దేశంలో ఆ మధ్య తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. కొద్ది రోజులుగా మళ్లీ కోరలు చాస్తోంది. రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల కలవరపెడుతోంది. ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కేసుల రెట్టింపు కాలం(డబ్లింగ్‌ టైం) కూడా సగానికి పైగా తగ్గిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. మార్చి ఒకటిన 504.4 రోజులుగా ఉన్న డబ్లింగ్‌ సమయం మార్చి 23 నాటికి 202.3 రోజులకు తగ్గిందని తెలిపింది. దాదాపు 20 రోజుల వ్యవధిలోనే డబ్లింగ్‌ రేటులో భారీ తగ్గుదల నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

* ముఖేశ్‌ అంబానీకి బెదిరింపుల కేసు మహారాష్ట్రలో రాజకీయ సునామీని సృష్టిస్తోంది. పోలీసు అధికారుల బదిలీల్లో భారీ కుంభకోణం జరిగిందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఆరోపించారు. మహారాష్ట్ర భాజపా ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ కుంభకోణానికి సంబంధించి తన వద్ద 6.3 గిగాబైట్ల కాల్‌డేటా, ఇతర సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ కుంభకోణం గురించి ఆధారాలతో సమాచారం అందించిన అధికారిని ఒక అనామక పోస్టుకు బదిలీ చేశారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే ఉద్ధవ్‌ ఠాక్రే ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

* ఫ్రెండ్లీ పోలీసింగ్‌.. తరచూ పోలీసు శాఖ ఉన్నతాధికారులు తరచూ చెప్పే మాటలివి. ఎక్కడ ఏం జరిగినా ధైర్యంగా పోలీసులను ఆశ్రయించవచ్చు.. సమస్య ఏదైనా ఎలాంటి ఆలోచన, బెరుకు లేకుండా పోలీసులను సంప్రదించవచ్చని చెబుతుంటారు. అయితే అచరణలో మాత్రం ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అనేది పూర్తిగా జరుగుతుందా? పోలీసులు నిజంగానే సామాన్య ప్రజలతో అంత ఫ్రెండ్లీగా ఉంటున్నారా? అంటే.. చెప్పలేని పరిస్థితి. తాజాగా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఓ డ్రైవర్ పట్ల కొంత మంది పోలీసులు ప్రవర్తించిన తీరు విమర్శలకు తావిస్తోంది.

* గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను ఒకే కార్పొరేషన్‌గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండింటినీ కలిపి మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌గా మారుస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరి మున్సిపాలిటీతో పాటు దాని పరిధిలో ఉన్న 11 గ్రామ పంచాయితీలు, తాడేపల్లి మున్సిపాలిటీ.. దాని పరిధిలో ఉన్న మరో 10 గ్రామ పంచాయితీలను కొత్త మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ మున్సిపల్ యాక్ట్‌- 1994 ప్రకారం ఈ ప్రాంతాలను కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది.

* కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌ తరగతులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు శాసనసభలో ఆమె ప్రకటన చేశారు.