దివాలా తీసిన రిలయన్స్-వాణిజ్య-02/04

* అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్‌(ఆర్‌కామ్‌) సంచలన నిర్ణయం తీసుకుంది. దివాళా పిటిషన్‌ దాఖలు చేయాలని అనూహ్యంగా నిర్ణయించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ద్వారా ఫాస్ట్ ట్రాక్ తీర్మానం కోరనున్నామని కంపెనీ రెగ్యులేటరీ సమాచారంలో తెలియజేసింది. దీంతో సోమవారం నాటి మార్కెట్లో అనిల్‌ ధీరూభాయ్‌ అంబానీ గ్రూప్‌(అడాగ్‌) కంపెనీ షేర్లకు భారీ షాక్‌ తగిలింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో అన్ని షేర్లు భారీగా నష్టపోతున్నాయి.సుమారు రూ.40వేల కోట్ల మేర రుణ పరిష్కారాలకు సంబంధించిన అంశంలో 40 రుణదాత సంస్థల నుంచి సంపూర్ణ అనుమతి లభించకపోవడంతో ఆర్‌కామ్‌ తాజా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత 18నెలలుగా ఆస్తుల విక్రయం ద్వారా రుణ చెల్లింపులకు ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రుణ పరిష్కార అంశం ముందుకు సాగలేదని ఆర్‌కామ్‌ తెలిపింది. దీంతో జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్రయించనున్నట్లు పేర్కొంది.దీంతో అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇతర గ్రూపు కంపెనీల షేర్లు కూడా పడిపోయాయి. ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆం‍దోళన కారణంగా నెలకొన్న అమ్మకాలతో ముఖ్యంగా ఆర్‌కామ్‌ షేరు 48 శాతం పతనమైంది. ఒక దశలో54.3 శాతం కుప్పకూలి, 5.30 రూపాయల వద్ద రికార్డు కనిష్టానికి చేరింది. దీంతోపాటు అడాగ్‌ గ్రూప్‌లోని రిలయన్స్‌ కేపిటల్‌ (12.5శాతం), రిలయన్స్‌ పవర్ (13శాతం), రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్ హోమ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌, రిలయన్స్ నావల్ తదితర కౌంటర్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి.
* భారత ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ కొత్త కారును లాంచ్‌ చేసింది. తన ఎంట్రీ లెవల్‌ కారు రెనాల్ట్‌ క్విడ్ లో కొత్త కారును సోమవారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.2.67-4.63 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా నిర్ణయించింది, మెరుగైన భద్రతా ఫీచర్స్‌తో దీన్ని భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని రెనాల్ట్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.0.8 లీటర్, 1లీటరు పెట్రోల్ ఇంజిన్లలో మాన్యువల్, ఆటోమేటెడ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో కొత్త క్విడ్‌ లభించనుంది. అత్యాధునిక భద్రత నిబంధనలతోపాటు, పాదచారుల భద్రతకు అనుగుణంగా తమ కొత్తకారు ఉంటుందనీ, ముఖ్యంగా ఏబీఎస్‌తో ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ లాంటి ఫీచర్లను ఇందులో జోడించినట్టు కంపెనీ తెలిపింది. అలాగే స్పీడ్‌, ఎయిర్‌బ్యాగ్‌ రిమైండర్‌ ఫీచర్‌, 17.64 సెం.మీ టచ్‌ స్క్రీన్‌ మీడియా, నావిగేషన్ సిస్టం, కెపాసిటివ్ టచ్‌స్క్రీన్‌తోపాటు ఆండ్రాయిడ్ , ఆపిల్ కార్‌ ప్లేలకు అనుగుణంగా ఫుష్‌ టు టాక్‌ ఫీచర్‌ అందించినట్టు తెలిపింది. కాగా 2.75కు పైగా యూనిట్ల అమ్మకాలతో భారత్‌ మార్కెట్‌లో రెనాల్ట్‌కు క్విడ్‌ విజయవంతమైనకారుగానిలి చింది.
*నారాయణా హృదయాలయ గ్రూప్‌ సీఈఓ, ఎండీ అశుతోశ్‌ రఘువంశీ రాజీనామా చేశారు. అశుతోశ్‌ రాజీనామాను కంపెనీ బోర్డు ఆమోదించింది. కొత్త ఎండీ, సీఈఓగా ఎమ్మాన్యుయేల్‌ రూపర్‌ ను నియమిస్తున్నట్లు సంస్థ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. సంస్థ వ్యవస్థాపక సభ్యుల్లో రూపర్ట్‌ ఒకరు. గ్రూప్‌ సీఓఓగా వీరేన్‌ శెట్టిని నియమించారు.
*కార్పొరేషన్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)గా పీవీ భారతి బాధ్యతలు స్వీకరించారు. కార్పొరేషన్‌ బ్యాంక్‌ పగ్గాలు చేపట్టిన తొలి మహిళ భారతీనే కావడం గమనార్హం. ఇంతకు ముందు ఆమె కెనరా బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కెనరా బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ (నష్ట నిర్వహణ విభాగం)గా 2016 సెప్టెంబరు నుంచి పనిచేశారు.
*జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కు రుణ పరిష్కార ప్రణాళిక ప్రతిపాదన సమర్పించనున్నట్లు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) తెలిపింది.
*వేలం నిర్వహించకనే, 15 సర్కిళ్లలో తమకు కేటాయించిన స్పెక్ట్రమ్‌ను వాపసు ఇచ్చేస్తామని ప్రభుత్వానికి టాటా టెలీ ప్రతిపాదించింది. భారతీ ఎయిర్‌టెల్‌లో విలీనానికి ముందే ఇలా చేస్తామని టెలికాం విభాగానికి తెలిపింది.
*జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కేసులో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు సాగుతోంది. బిర్లా మ్యూచువల్‌ ఫండ్‌, ఐసీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌, రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈఓలతో పాటు రేటింగ్‌ సంస్థ బ్రిక్‌వర్క్స్‌ సీఈఓకు సెబీ సభ్యుడు మదాబీ పూరి సమన్లు జారీ చేశారు.
* మొత్తం 35 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్‌ఈ)ల్లో వ్యూహాత్మక వాటా విక్రయానికి ఆర్థిక శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం పవన్‌హాన్‌్ లో వాటా విక్రయ ప్రక్రియ కొనసాగుతోంది.
*ఇ కామర్స్‌ పోర్టళ్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు సంబంధించి, ఈనెల 1 నుంచి దేశీయంగా అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రభావం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లపై భారీగానే పడింది. అమెజాన్‌ దేశీయ విభాగమైన అమెజాన్‌.ఇన్‌లో, నిత్యావసరాలు సరఫరాకు ఉద్దేశించిన అమెజాన్‌ ప్యాంట్రీ సేవలు కూడా ప్రస్తుతానికి దేశీయంగా నిలిచిపోయాయి.
*ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నుల మదింపు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరగబోతోంది. రెండేళ్లలో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్‌ సుశీల్‌ చంద్ర అభిప్రాయపడ్డారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com