జిమ్స్‌ లక్ష్యం క్యాన్సర్‌ రహిత దేశం-చినజీయర్‌ స్వామి

యాదాద్రి క్షేత్రం సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైందని సీఎం కేసీఆర్‌ అన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఓ అద్భుత క్షేత్రంగా ఖ్యాతిగాంచింది. యాదాద్రి ఆలయం దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది. వెయ్యి ఎకరాల్లో టెంపుల్‌ సిటీ నిర్మాణం జరుగుతోంది. ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిత్యాన్నదాన సత్రం నిర్మాణానికి రూ.10కోట్లు విరాళాలు వచ్చాయి. ఉత్తరభాగంలో ఆలయం కిందివైపు భూమిని సేకరించడం జరిగింది. స్థలసేకరణకు రూ.70కోట్లు విడుదల చేస్తున్నాం. నిత్యాన్నదాన సత్రాలు, బస్‌స్టేషన్‌, ఇతర నిర్మాణాలు చేపడుతాం. ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయ నిర్మాణం సాగుతోందని కేసీఆర్‌ చెప్పారు.యదాద్రి ప్రపంచంలోనే యూనిక్‌ టెంపుల్‌. ఏడంతస్తుల గోపురం కూడా శిల్పాలతోనే కట్టాం. ఆలయాలు ఒక తరం నుంచి మరో తరానికి సంస్కృతిని, సంస్కారాన్ని అందిస్తాయి. 250 ఎకరాల్లో 350 క్వార్టర్ల నిర్మాణం చేస్తాం. క్వార్టర్ల నిర్మాణానికి 43 మంది దాతలు ముందుకు వచ్చారు. గంధమల్ల, బస్వాపూర్‌ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. 50 ఎకరాల్లో ప్రవచన మంటపం నిర్మిస్తాం. మరో పది పదిహేను రోజుల్లో మళ్లీ యాదాద్రికి వస్తా. యాదాద్రి క్షేత్రానికి చాలా విశిష్టత ఉంది. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి 133 దేశాల నుంచి వైష్ణవ పండితులు వస్తారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఆలంపూర్‌ ఒకటి. గత పాలకులు జోగులాంబ శక్తిపీఠాన్ని పట్టించుకోలేదని సీఎం వ్యాఖ్యానించారు.అంత‌కుముందు యాదాద్రి క్షేత్రాన్ని సీఎం కేసీఆర్ సంద‌ర్శించారు. విహంగ వీక్ష‌ణం ద్వారా ఆల‌య అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించారు. ప్ర‌ధానాల‌యం, వ్ర‌త మంట‌పం, శివాల‌యం ప‌నుల పురోగ‌తిని అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం లక్ష్మీ న‌ర‌సింహ‌స్వామిని కేసీఆర్ ద‌ర్శించుకున్నారు.
1. దొరకని కిరీటాల ఆచూకీ
తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం మాయమైన మూడు ఉత్సవమూర్తుల కిరీటాలు ఏమయ్యాయో.. ఆదివారానికీ స్పష్టత రాలేదు. తిరుపతి అర్బన్‌ పోలీసులు దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఆరు బృందాలు విడివిడిగా ఆలయ సిబ్బంది, అర్చకులను ప్రశ్నిస్తున్నాయి. సాయంత్రం 5.30 గంటల నుంచి 6 గంటల మధ్యనే కిరీటాలు మాయమై ఉండవచ్చని పోలీసులు అంచనాకు వచ్చారు. శనివారం సాయంత్రం 5 గంటలకు విధులు మారే సమయంలో అంతా బాగానే ఉన్నాయని, తర్వాతే కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. కిరీటాలు అదృశ్యమైన తర్వాత అర్చకుల హడావుడిని గమనించిన సూపరింటెండెంట్‌ విషయాన్ని తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదించారు. వెంటనే తితిదే జేఈవో పోలా భాస్కర్‌తో పాటు సీవీఎస్‌వో గోపినాథ్‌ జెట్టి, అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌ రంగంలోకి దిగారు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సాయంత్రం భక్తుల రద్దీ తగ్గిన తర్వాత ఆలయ తలుపులన్నీ మూసి రహస్య విచారణ ప్రారంభించారు. అర్చకులతో పాటు విజిలెన్స్‌, తితిదే సిబ్బందిని ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. ఆలయ పరిసరాల్లో మొత్తం వెతికారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు విచారణ నిర్వహించిన తిరుపతి పోలీసులు.. ఉదయం నుంచి మరోసారి ఆలయానికి వచ్చి పరిశీలించారు.
2. మహా దివ్యక్షేత్రంగా యాదాద్రి
స్వయంభువులతో విలసిల్లుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణ పనులు భేషుగ్గా సాగుతున్నాయని.. ఇవి మరింత వేగవంతం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆలయ ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా చాటేందుకే అద్భుత శిల్పకళా సంపదతో పునర్‌నిర్మిస్తున్నామని వెల్లడించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాక తొలిసారిగా ఆదివారం యాదాద్రికి వచ్చిన కేసీఆర్‌ దాదాపు ఆరుగంటలపాటు పనుల పరిశీలన, సమీక్షలతో తీరిక లేకుండా గడిపారు. విహంగ వీక్షణంలో పరిసర ప్రాంతాలను పరిశీలించారు. క్షేత్రానికి ఉదయం 11.50 గంటలకు చేరుకున్న ముఖ్యమంత్రి బాలాలయాన్ని సందర్శించి స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం పండితుల వేదాశీర్వచనం పొందారు. అనంతరం కొండపై జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆ తర్వాత ఆలయ నగరిలో విలేకర్లతో మాట్లాడారు.
3. ఆలయాలకు విముక్తి కల్పించాలి-ఆధ్యాత్మికవేత్త కొండవీటి జ్యోతిర్మయి
ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి హిందూ దేవాలయాలకు విముక్తి కల్పించేంత వరకు ఉద్యమం సాగిస్తామని ప్రముఖ గాయని, ఆధ్యాత్మికవేత్త కొండవీటి జ్యోతిర్మయి అన్నారు. మందిరాల రక్షణకు ఓటును ఆయుధంగా మలుచుకోవాలని ప్రజలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్‌సభ, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలలో మందిరాల రక్షకులను గెలిపించాలని, వ్యతిరేకులను ఓడించాలని పిలుపునిచ్చారు. ఆదివారం ధర్నాచౌక్‌లో మందిర్‌ స్వరాజ్‌ ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధర్మ చైతన్యంతో ఓటు వేయాలని కోరారు.
4. జిమ్స్‌ లక్ష్యం క్యాన్సర్‌ రహిత దేశం-చినజీయర్‌ స్వామి
క్యాన్సర్‌ మహమ్మారిని తరిమికొట్టాలంటే ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి చెప్పారు. సోమవారం ప్రపంచ క్యాన్సర్‌ దినాన్ని పురస్కరించుకుని శంషాబాద్‌ పరిధి శ్రీరామ నగర్‌లోని జిమ్స్‌ హోమియోపతిక్‌ వైద్య కళాశాలలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి చినజీయర్‌ స్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్యాన్సర్‌ కారణాలు, లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స విధానాలపై ప్రముఖ వైద్య నిపుణులు మోహన్‌వంశీ అవగాహన కల్పించారు. చినజీయర్‌ స్వామి మాట్లాడుతూ..దేశాన్ని క్యాన్సర్‌రహితంగా తీర్చిదిద్దడంలో భాగంగా వికాస తరంగిణి, జిమ్స్‌ సంస్థల సౌజన్యంతో మహిళా ఆరోగ్య వికాస్‌కు శ్రీకారం చుట్టామని తెలిపారు.
5. దుర్గమ్మ సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ సోహన్‌, జస్టిస్‌ శివశంకర్‌లతో కలసి ఆదివారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలకగా.. వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక భవన ప్రారంభోత్సవానికి హాజరైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయిని మర్యాద పూర్వకంగా కలిసేందుకు వారు అమరావతి వచ్చారు. అనంతరం దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ వారికి శేషవస్త్రాలు, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. జిల్లా న్యాయమూర్తి లక్ష్మణ్‌, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్లు నాగరాజు, నరసింహరావు, హేమంత్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.
6. నేడు అర్ధరాత్రి ప్రత్యేక పూజలతో ‘నాగోబా’ జాతర ప్రారంభం
ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆదిలాబాద్ జిల్లాలోని నాగోబా జాతర సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభంకానుంది. నాలుగురోజుల కిందట మెస్రం వంశీయులు జన్నారం మండలం హస్తలమడుగు నుంచి పవిత్ర గోదావరి జలాలను తీసుకొని కాలినడకన కెస్లాపూర్‌కు చేరుకున్నారు. నాగోబా ఆలయ పరిసరాల్లోని మర్రిచెట్ల కింద సేదతీరారు. అర్ధరాత్రి సమయంలో మెస్రం వంశీయల ప్రత్యేక పూజల అనంతరం జాతర ప్రారంభమవుతుంది. ఈ నెల 7న దర్బార్ జరుగనుండగా.. జాతరకు వచ్చేవారి కోసం అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు.వివిధ రాష్ర్టాల నుంచి నాగోబాను ఆదివాసీలు తమ ఆరాధ్యదైవంగా కొలుస్తారు. ఈ జాతరకు తెలుగురాష్ర్టాల నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి భక్తులు తరలివస్తారు. సమ్మక్క, సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్దదైన ఈ జాతర ఆదివాసీల ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుంది. జాతరలో ప్రజా దర్బార్ కీలకమైనది. మంత్రులు, కలెక్టర్, వివిధశాఖల అధికారులు హాజరై గిరిజనుల సమస్యలకు పరిష్కారం చూపడం ఇక్కడి ప్రత్యేకత. 1946లో శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్ సూచనలో నిజాంకాలం నుంచి ప్రభుత్వం అధికారికంగా జాతరను నిర్వహిస్తున్నది.ఇబ్బందుల్లేకుండా చర్యలు తెలంగాణ సర్కారు గత ఏడాది నాగోబా ఆలయ నిర్మాణంతోపాటు ఇతర వసతులకు నిధులు మంజూరు చేసింది. ఆలయ పునర్నిర్మాణానికి రూ.2 కోట్లు, రూ.1.5 కోట్లతో దర్బార్, విశ్రాంతి భవనం నిర్మాణాలు జరుగుతున్నాయి. కెస్లాపూర్ నుంచి నాగోబా ఆలయం వరకు రూ.66 లక్షలతో డబుల్‌రోడ్డు నిర్మాణం, మల్లాపూర్ నుంచి నాగోబా ఆలయం వరకు రూ.84 లక్షలతో బీటీ రోడ్డు పూర్తయింది. మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, భోజన వసతి, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయనున్నారు.
7. వనదేవతలను దర్శించుకున్న ఛత్తీస్‌గఢ్‌ మంత్రి, ఎమ్మెల్యేలు
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో కొలువుదీరిన ఆదివాసీ గిరిజన దైవాలు సమ్మక్క-సారక్కను ఆదివారం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ఎక్సైజ్‌ మినిస్టర్‌ కవ్వాసి లక్మా, బీజాపూర్‌ ఎమ్మెల్యే విక్రమ్‌ మాండవి, పీసీసీ మెంబర్‌ అజయ్‌సింగ్‌, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క దర్శించుకున్నారు. అమ్మవార్ల దర్శనానికి వచ్చిన వారికి పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, అమ్మవార్ల పూజారులు, దేవాదాయశాఖ అధికారులు డోలి వాయిద్యాల నడుమ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడ్దిరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆదివాసీ మ్యూజియాన్ని సందర్శించారు. పురాతన కాలంలో ఆదివాసీలు ఉపయోగించిన పనిముట్లు, ఆయుధాలను పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీ నాగరికతను అందరూ మర్చిపోయారని, అంతరించిపోతున్న ఆదివాసీ నాగరికతను కాపాడేందుకు అధికారులు మ్యూజియం నిర్మించడం ఆనందంగా ఉందన్నారు.
8. కుంభమేళాలో నేడు రెండవ పుణ్యస్నానం… ప్రత్యేకత ఇదే!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ఘనంగా జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఈరోజు రెండవ పుణ్యస్నానాలు నిర్వహిస్తున్నారు. మౌనీ అమావాస్య సందర్భంగా సంగమ ప్రాంతానికి భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఉదయం 6.15కు మహానిర్వాణీ, అటల్ అఖాడాలు స్నానం చేశారు. తరువాత పంచాయతీ నిరంజనీ అఖాడా, తపోనిధి పంచాయతీ ఆనంద్ అఖాడాలు స్నానం చేశారు. వీరి స్నానాల కోసం అధికారులు 40 నిముషాలు కేటాయించారు. అలాగే వీరి కోసం 41 ఘాట్లు సిద్ధం చేశారు. ఈరోజు మూడు కోట్ల మంది భక్తులు స్నానాలు చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఇదే రోజు మొదటి తీర్థంకరుడు రుషబ్‌దేవ్ తన మౌన తపస్సును విరమించారని చెబుతుంటారు. తరువాత ఆయన పవిత్ర సంగమంలో స్నానం చేశారట. ఈ సారి మౌనీ అమావాస్య, సోమవారం కలసి రావడం ఎంతో గొప్ప విషయమని పండితులు చెబుతున్నారు.
9. విశాఖపట్నంభీమిలి సాగరతీరం భక్తులతో కిటకిటలాడుతోంది.
మూడేళ్ల తర్వాత మహోదయ పుణ్యగడియాలు రావడంతో భీమిలి సాగర తీరానికి భక్తులు పోటెత్తారు.ఉదయం ఆరు గంటల నుంచి భక్తులు సాగర తీరంలోని గొస్తనీ సాగర సంగమం వద్ద మహోదయ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పుణ్యగడియలు ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.భక్తుల కోసం అధికారులు ప్రత్యేక స్నాన ఘాట్లు, స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశారు.
10. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామం బిచ్ రోడ్డు లో చోల్లoగి అమవాస్య సందర్బంగా మాఘమాస స్నానాలకు (సముద్ర స్నానం ) భక్తులు పోటెత్తారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వాకలపూడి ఉప్పాడ రోడ్డు లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది
11. తిరుమల సమాచారం
ఈరోజు సోమవారం.. *04-02-2019* ఉదయం *5* గంటల సమయానికి. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ…. శ్రీ వారి దర్శనానికి *2* కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులు…. శ్రీ వారి సర్వ దర్శనానికి *4* గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *03* గంటల సమయం పడుతోంది..నిన్న ఫిబ్రవరి *3* న *68,914* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *₹:2.66* కోట్లు.
12. శుభమస్తు
తేది : 4, ఫిబ్రవరి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : సోమవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : అమావాస్య
(నిన్న రాత్రి 11 గం॥ 54 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 33 ని॥ వరకు)
నక్షత్రం : శ్రవణము
(ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 56 ని॥ నుంచి
మర్నాడు ఉదయం 6 గం॥ 1 ని॥ వరకు)
యోగము : సిద్ధి
కరణం : చతుష్పాద
వర్జ్యం : (ఈరోజు ఉదయం 7 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 14 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 7 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 14 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 6 గం॥ 16 ని॥ నుంచి ఈరోజు రాత్రి 8 గం॥ 4 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 6 గం॥ 16 ని॥ నుంచి ఈరోజు రాత్రి 8 గం॥ 4 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 37 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 54 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 8 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 37 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 20 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 11 గం॥ 3 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 28 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 47 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 12 ని॥ లకు
సూర్యరాశి : మకరము
చంద్రరాశి : మకరము
13. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో జ‌రిగే కుంభమేళా సందర్భంగా ముక్కోటి దేవతలు త్రివేణి సంగమంలో కొలువుదీరుతారని, వారిని స్మరిస్తూ పుణ్యస్నానాలు చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని హిందువుల నమ్మకం. అందుకే దేశ‌విదేశాల నుంచి కోట్లాది మంది భ‌క్తులు కుంభమేళాకు హాజరవుతారు.ఈ నేప‌థ్యంలోనే ప్ర‌యాగ్‌రాజ్‌లో కుంభ‌మేళాకు భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌స్తున్నారు. మౌని అమావాస్య సంద‌ర్భంగా పుణ్యస్నానాలు ఆచరించారు.
14. మౌని అమావాస్య అంటే…?
సూర్యుడు మకర సంక్రాతి పర్వదినాన ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశిస్తాడు. ఆ తరువాత వచ్చే పుష్యమాస అమావాస్యను ‘మౌని అమావాస్య’ అంటారు. ఆ రోజున పితృతర్పణాలూ, నదీ స్నానాలు చేయడం, మౌన వ్రతం పాటించడం (అంటే రోజంతా మాట్లాడకుండా ఉండడం) పుణ్యప్రదమన్నది శాస్త్రోక్తి. మౌని అమావాస్యనాడు గంగానది అమృతంగా మారుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ రోజున వారణాసిలోని గంగానదిలో, అలహాబాద్‌ (ప్రయాగ)లోని త్రివేణీ సంగమంలో లక్షలాది ప్రజలు స్నానాలు ఆచరిస్తారు. గంగా స్నానానికి అవకాశం లేనివారు సమీపంలో ఉన్న నదిలో, ఇతర నీటి వనరుల్లో గంగా దేవిని తలచుకొని స్నానం చేసి, ఆపన్నులకు దానాలు చేయడం మంచిదన్నది పెద్దల మాట.
15. కుంభమేళాలో పదివేల మందికి నాగా దీక్షలు
ప్రస్తుత కుంభమేళా సందర్భంగా పదివేల మంది నాగా సాధువులుగా దీక్ష తీసుకున్నారు. అందులో ఇంజినీర్లు, ఎంబీఏలు కూడా ఉన్నారు. వారందరికీ తలనీలాలు తీసి కేవలం పిలక ఉంచి దీక్షలు ఇచ్చారు. ఎవరైనా నాగా సాధువుగా మారాలంటే ఈ తంతు తప్పనిసరి. తిరుక్షవరం తర్వాత గోచిపెట్టుకుని తమకు తామే పిండప్రదానం చేసుకోవాలి. బతికున్న ఇతర కుటుంబ సభ్యులకూ పిండం సమర్పించాలి. దాంతో పాత అస్తిత్వం పూర్తిగా అంతరించిపోతుంది. కొత్తపేరుతో నాగా సాధువుగా జీవితం ప్రారంభించాల్సి ఉంటుంది. హరిద్వార్, ప్రయాగ్‌రాజ్‌లలో ప్రస్తుతం ఈ దీక్షలు జోరుగా సాగుతున్నాయి. అయితే దీక్ష తీసుకోగానే సంపూర్ణంగా నాగా సాధువుగా మారినట్టు కాదు. తర్వాత కఠినమైన పరీక్షలుంటాయి. వాటన్నిటిని దాటిన తర్వాతనే పూర్తిగా నాగా సాధువుగా మారినట్టు భావించాలి. అంతిమ దీక్ష వేరే ఉంటుంది. నిరంజనీ, మహానిర్వాణి వంటి వేరువేరు పేర్లు గల సుమారు 13 అఖారాలు ఉన్నాయి. వీటి అధిపతులు దీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేవలం కుంభమేలా సందర్భంగానే ఈ దీక్షలు ఇస్తారు. ఏదో క్షణికావేశంలో చేరారా? లేక జీవితంలో సంక్షోభం వచ్చి చేరారా? అనేది పరీక్షిస్తారు. నిజంగా వైరాగ్యం కలిగిందా? అనేది కఠిన పరీక్షల ద్వారా నిగ్గు తేల్చుకుంటారు. అన్నిరకాలుగా సంతృప్తి కలిగిన తర్వాతనే నాగా సాధువుగా స్వీకరిస్తారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com