అల్పాహారం మానేయకండి

మహిళలు బరువును అదుపులో పెట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఇందులో భాగంగా కొన్ని కొన్ని తప్పులు కూడా చేస్తుంటారు. తక్కువగా తినడం, శరీరానికి సరిపోని వ్యాయామాలు చేయడం వంటివి. మరేం చేయాలి?
పోషకాలతో కూడిన అల్పాహారం రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది. మాంసకృత్తులు, పీచు పదార్థాలు, విటమిన్లు, చక్కెర ఎక్కువగా ఉండేలా దీనిని తయారు చేసుకోవాలి. ఇవి జీర్ణం అవడానికి కొంత సమయం తీసుకుంటాయి. దీంతో అతిగా తినలేం. కాబట్టి బరువు అదుపులో ఉంటుంది.
* రోజూ ఒకే రకమైన వర్కవుట్స్‌ చేస్తే విసుగురావొచ్చు. దాంతో ఇక కొనసాగించాలనిపించదు. అలాంటప్పుడు మిత్రులతో కలిసి జుంబా డాన్స్‌ ప్రయత్నించండి. అప్పుడప్పుడు దగ్గర్లో ఉన్న పార్కులు, ఇతర ప్రాంతాలకు వెళ్లండి. చిన్నప్పుడు మీరు ఆడిన ఆటలు ఆడండి. ఇవన్నీ మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి.
*వ్యాయామం చేసే సమయంలో చెమట రూపంలో శరీరం నుంచి ఎక్కువ నీటిని కోల్పోతాం. అందుకే అధికంగా నీటిని తాగడం మంచిది. శరీరంలో నీటి శాతం తక్కువగా ఉంటే తలనొప్పి, అలసట దరిచేరుతాయి. ఆకలి పెరిగి ఎక్కువగా తింటాం. వీటన్నింటికీ దూరంగా ఉండాలంటే వ్యాయామానికి ముందు, తరువాత మంచినీళ్లు తాగండి.
* అలసటను వదిలించుకొని, మెదడును చురుగ్గా ఉంచుకోవడానికి చాలా మంది ఉద్యోగస్తులు కాఫీ, టీలకు అలవాటు పడతారు. కెఫీన్‌, తీపి పదార్థాలు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అలసటకు గురయ్యేలా చేస్తాయి. అలాంటప్పుడు కాసేపు అటూ ఇటూ నడవండి. ఒత్తిడి, అలసటా దూరం అవుతాయి.
* రోజూ వ్యాయామానికి అరగంట సమయం కేటాయించండి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వ్యాయామం చేయడం మాత్రం మరవకండి. మహిళలు ఫిట్‌గా ఉండాలంటే వారంలో కనీసం మూడు గంటలైనా వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com