ఇంటి చుట్టూ మొక్కలను పెంచితే.. దోమలు ఎక్కువగా వచ్చేస్తాయని కొందరు భయపడతారు. కానీ కొన్ని రకాల మొక్కలు దోమలను దూరంగా తరిమేస్తాయి కూడా. అవేమిటంటే…
తులసి: సాధారణంగా ప్రతి ఇంట్లోను ఈ మొక్క కనిపిస్తుంది. ఎన్నో రకాల ఔషధాల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. దోమలతోపాటుగా పురుగులనూ ఇది తరిమికొడుతుంది.
లావెండర్: సువాసనలను వెదజల్లే ఈ మొక్క కీటకాలనూ దరిచేరనివ్వదు. దోమలు, ఈగలు, ఇతర కీలకాలను దూరంగా తరిమేస్తుంది.
లెమన్‌గ్రాస్ (నిమ్మగడ్డి): ఈ గడ్డి నుంచి వెలువడే నిమ్మ సువాసనలు దోమలను దూరంగా ఉంచుతాయి.
లెమన్‌థైమ్: ఈ మొక్క నుంచి కూడా నిమ్మ వాసనలు వస్తాయి. ఇది దోమలను తరిమేయడమే కాకుండా… తేనెటీగలను ఆకర్షిస్తుంది.
అగిరేటమ్: దీన్నే గోట్‌వీడ్, జంగిల్ పుదీనా అనికూడా అంటారు. దీనికి వంగపండు రంగు పూలు కూడా పూస్తాయి. దీన్నుంచి వచ్చే నూనెను దోమల నివారణ మందుల్లో ఉపయోగిస్తారు.
క్యాప్‌నిప్: దీన్నే క్యాట్‌మింట్ అనికూడా అంటారు. దీన్నుంచి వచ్చే నూనెలను దోమల నివారణ మందులు, పెర్‌ఫ్యూమ్‌లలోనూ వాడతారు.