11వేల పైకి నిఫ్టీ-వాణిజ్య-02/06

*దేశీయ స్టాక్ మార్కెట్లు అభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 98పాయింట్లు ఎగిసి 36714 వద్ద నిప్టీ 35 పాయింట్లు లాభపడింది. 10969 వద్ద ట్రేడింగ్ అరభించాయి. అనంతరం మరింత ఎగిది 69 పాయింట్లు లాభంతో నిప్టీ 11వేల స్థాయిని తాకింది. సెన్సెక్స్ డబుల్ సెంచరీ లాభాలతో దూసుకుపోతోంది. అలాగే ఫలితాల జోష్ తో టెక్ మహింద్రా, హెచ్పీసీఎల్ టాప్ గేయినర్స్ గా ఉన్నాయి. ఇంకా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఎస్ బ్యాంకు యూపీఎల్ కూసా లభాపడుతున్నాయి.
*రెనో ఇండియా ఎండీగా నియమితులైన మామిళ్లపల్లి వెంకట్రామ్‌ హైదరాబాద్‌ వాస్తవ్యులే. ఆయన విద్యాభ్యాసం కేంద్రీయ విద్యాలయలో సాగింది. 8వ తరగతి నుంచే వాహనాలపై మక్కువ ఏర్పడిందని, తన తండ్రి నడిపే స్కూటర్‌ భాగాలను విడదీసే వాడినే కానీ, మళ్లీ బిగించడం చేతనయ్యేది కాదని తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వెంకట్రామ్‌ చెప్పారు. రోడ్డుపై వెళ్తున్న కార్లు, ట్రక్కులు కూడా ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేదని, అదే తనను వాహన రంగంలో చేరేలా ప్రేరేపించిందని వివరించారు. వాహన సంస్థల్లో సమీకరణ, మెటీరియల్స్‌ నిర్వహణ, సరఫరా వ్యవస్థలు, విక్రయదార్లతో అనుబంధం- అభివృద్ధి, లాజిస్టిక్స్‌, సప్లయర్‌ మేన్యుఫ్యాక్చరింగ్‌ డిజైనింగ్‌లో ఆయనకు ప్రావీణ్యత ఉంది. టాటా మోటార్స్‌లో సోర్సింగ్‌ అధిపతిగా, దక్షిణకొరియాలో జనరల్‌ మోటర్స్‌ గ్లోబల్‌ పర్చేజింగ్‌, సప్లై చెయిన్‌ అధిపతిగా వ్యవహరించారు. లంబోర్గిని ఇండియా, ఐషర్‌ ట్రాక్టర్స్‌లోనూ విధులు నిర్వర్తించారు.
*సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ కాంట్రాక్టు పరిశోధన, తయారీ సేవల వ్యాపారాన్ని విడదీయనుంది. ఈ వ్యాపారాన్ని విడదీసి తన అనుబంధ కంపెనీ అయిన సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ (ఎస్‌పీఎల్‌) లో కలపనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
*సైయెంట్‌ లిమిటెడ్‌ ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. రూ.5 ముఖ విలువ కల ఒక్కో షేర్‌ను రూ.700 ధరకు మించకుండా బైబ్యాక్‌ చేయాలని నిర్ణయించింది. ఇందుకు రూ.200 కోట్లు కేటాయిస్తారు. దీని ప్రకారం 28.75 లక్షల షేర్లు (కంపెనీ జారీ మూలధనంలో 2.54 శాతం) వెనక్కి కొనుగోలు చేయవచ్చు. బైబ్యాక్‌లో కంపెనీ ప్రమోటర్లు పాల్గొనరు. సైయెంట్‌ షేర్‌ మంగళవారం బీఎస్‌ఈలో రూ.606.80 వద్ద ముగిసింది.
*నీరవ్‌ మోదీ చేసిన రూ.14,356 కోట్ల మోసం ప్రభావం నుంచి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ బయటపడింది. ఈ కుంభకోణానికి సంబంధించి బ్యాంకు పూర్తి కేటాయింపులు చేసేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.246.51 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయగలిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో బ్యాంకు ఆర్జించిన నికర లాభం రూ.230.11 కోట్లతో పోలిస్తే ఇది 7.12 శాతం ఎక్కువ. బ్యాంకు మొత్తం ఆదాయం రూ.15,257.50 కోట్ల నుంచి 2.64 శాతం క్షీణతతో రూ.14,854.24 కోట్లకు తగ్గింది.
*సిమెంటు ధరలు భగ్గుమన్నాయి. 50 కేజీల బస్తాపై రూ.40-60 మేర సిమెంటు కంపెనీలు ధరలు పెంచాయి. దక్షిణాదిలో గిరాకీ పుంజుకోవడమే ఇందుకు కారణమని డీలర్లు చెబుతున్నారు. తెలంగాణ, తమిళనాడుల్లో గిరాకీ ఎక్కువగా ఉందని తెలిపారు.
*ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సహవ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్‌ ఎట్టకేలకు మౌనం వీడారు. వ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణలతో గత నవంబరులో ఫ్లిప్‌కార్ట్‌కు రాజీనామా చేసిన బిన్నీ.. తొలిసారిగా భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించారు.
*బీటెక్‌ విద్యార్థులకు సాంకేతిక, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను నేర్పించే హైదరాబాద్‌కు చెందిన 11 ఏళ్ల బాలుడు మొహమ్మద్‌ అలీ హసన్‌.. అతి తక్కువ ఖర్చుతో వాహన ఉద్గారాల ఫిల్టర్‌ను తయారు చేసింది గుణదలకు చెందిన 17 ఏళ్ల పోతునూరి లయ.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com