కొబ్బరి నీళ్లు అమృతంతో సమానం

ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుత పానీయం కొబ్బరినీళ్ళు. ఇందులో కొవ్వు ఉండదు. కృత్రిమమైన సంరక్షకులు, రసాయనాలు ఉండవు. అందుకే ఇవి మనిషికి దివ్యౌషధంగా ఉపయోగపడుతాయి.కొబ్బరినీళ్లలో మనకు అవసరమైన అన్ని రకాల ఖనిజాలున్నాయి. ఔషధ విలువలు ఎంతో మెండు. కొబ్బరి బోండం లోపల స్వచ్ఛమైన రంగులో మెరిసే కొబ్బరి నీళ్ళలో ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైములు, మామూలు చక్కెరలు ప్రత్యేక రీతిలో కలిగి ఉన్నాయి. కొబ్బరినీళ్ళు శారీరక శ్రమ చేయడం వల్ల, చెమటద్వారా మన శరీరం నుంచి బయటకెళ్లిన ద్రవాలను, ఖనిజాలను మనలో నింపుతుంది. డీహైడ్రేషన్ వల్ల మన శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి అందించడంలో కొబ్బరినీళ్లు ఎంతో సహాయం చేస్తాయి. కొబ్బరినీళ్ళు జీవన క్రియలు సరిగా జరగడానికి, తిన్న ఆహారం జీర్ణం కావడానికి సహాయం చేస్తాయి. కొబ్బరినీళ్ళలో ఉన్న బయోయాక్టివ్ ఎంజైము మన జీవనక్రియలను వేగవంతం చేస్తుంది. అరుగుదల శక్తిని మెరుగుపరుస్తుంది. కండరాలు తిమ్మిరెక్కడం, మొద్దుబారడం, అలాగే కండరాలు సాగడం లాంటి ఇబ్బందుల నుంచి కొబ్బరినీళ్ళు మనకు ఉపశమనాన్నిస్తాయి. మనశరీరానికి బాగా అవసరమైన చాలా ముఖ్యమైన ఎలక్ట్రోలైట్, ఖనిజం పొటాషియం. కొబ్బరినీళ్ళను తాగడం వల్ల మన శరీరంలో పొటాషియం తిరిగి భర్తీ అవుతుంది. దాంతో తిమ్మిరి ఎక్కడం, మొద్దుబారడం తగ్గుతాయి. కొబ్బరినీళ్ళు తాగడం వల్ల మన శరీరంలోని జీవనక్రియలు వేగవంతం అవుతాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com