Health

వ్యాక్సిన్ పొడిచాక ఇలా చేయవద్దు

షుగర్ రోగులు…ఇవి తినకండి

కరోనా వ్యాక్సినేషన్‌ దేశవ్యాప్తంగా మొదలైంది. ముందు వరసలో వృద్ధులకీ మధ్యవయసువాళ్లకీ ఇస్తున్నారు. అయితే వ్యాక్సిన్‌ వేయించుకునే ముందూ తరవాతా కూడా కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు వెళ్లేటప్పుడు మాస్క్‌ పెట్టుకునే ఉండాలి. ఆరు అడుగుల దూరాన్నీ పాటించాలి. అలర్జీలూ ఇతరత్రా మందులు వేసుకుంటున్నవాళ్లకయితే వైద్యుల సలహా తప్పనిసరి. మొదటి డోసు పడిపోగానే ఇక ఫరవాలేదు అనుకోకుండా మరింత జాగ్రత్తగా ఉండాలి. మాస్క్‌ లేకుండా తిరగకూడదు. గుంపులోకి వెళ్లకపోవడం, ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. టీకా తరవాత కొద్దిగా ఒళ్లు నొప్పులూ జ్వరమూ అలసటా వంటివి వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి పోషకాహారం- అదీ ద్రవపదార్థాలు తీసుకోవడం మంచిది. ఇంజెక్షన్‌ ఇచ్చిన చోట తడి బట్టతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. బాగా నిద్రపోవాలి. ఆల్కహాల్‌, ధూమపానాలకు దూరంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా వెంటనే ఫ్యామిలీ డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. రెండు డోసులు పూర్తయ్యాక కూడా మాస్క్‌ పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం మర్చిపోవద్దు. వ్యాక్సిన్‌ అనేది వైరస్‌తో పోరాడేందుకే కానీ అది సోకకుండా ఉండేందుకు కాదు. పైగా వైరస్‌ ఎప్పటికప్పుడు మారిపోతుందన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు.