రోజువారీ జీవనంలో మనం కొన్ని కూరగాయలని నిర్లక్ష్యం చేస్తుంటాం. అందులో ముల్లంగి కూడా ఒకటి. దానిలోని పోషకాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అవేంటో చూద్దాం..
★ ముల్లంగి శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపుతుంది.
కేన్సర్ కణాలు వృద్ధి చెందకుండా కాపాడుతుంది.
ముల్లంగిలో కేలరీలు చాలా తక్కువ, ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. విటమిన్ సితో పాటు ఇతర పోషకాలు ఉండే దీనిలో పిండి పదార్థాలు సున్నా. బరువు తగ్గాలనుకునేవారికి ఇది చక్కని ఆహారం అంటారు పోషకాహార నిపుణులు.
★ కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు నివారించడంలో ఈ దుంప కూర కీలకంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలే అందుకు కారణం.
★ ఇందులో విటమిన్ సి, జింక్, ఫాస్ఫరస్ వంటివి చర్మం పొడిబారకుండా చేస్తాయి. మొటిమల్ని నివారించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
★ ఫ్లేవనాయిడ్లు ముల్లంగిలో అధికం. ఇవి గుండెకు రక్త సరఫరా సరిగ్గా జరిగేలా చేస్తాయి. గుండె జబ్బుల నుంచి కాపాడతాయి. దీన్ని పదార్ధాలు గానే కాదు, సలాడ్ల రూపంలో కూడా తీసుకోవచ్చు.