సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సొంతమైన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలనం నిర్ణయం తీసుకుంది.
రానున్న కాలంలో లక్షలకొద్దీ అనుమాన్సాద వాట్సాప్ ఖాతాలను తొలగించనుంది.
ముఖ్యంగా అసంబద్ధ వార్తలను, ఫేక్ న్యూస్ లను వ్యాప్తి చేసే గ్రూపులే టార్గెట్‌గా ఈ చర్యను చేపట్టనుంది.
అంతేకాదు ఈ మేరకు దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు కూడా హెచ్చరికలను జారీ చేసింది.
ఎన్నికల సమయంలో బల్క్‌గా సందేశాలను పంపించే అవకాశం ఉందని, తద్వారా తాము అందించే ఉచిత సేవ దుర్వినియోగంకానుందని వ్యాఖ్యానించింది.
ఈ ప్రయత్నాలను అడ్డకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాట్సాప్ గురువారం ఒక ప్రకన జారీ చేసింది.
దీని ద్వారా తమ మెసేజింగ్ ప్లాట్‌ఫాంను సురక్షితంగా ఉంచాలని భావిస్తునట్టు తెలిపింది.
అలాగే ఈ ఏడాది జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్, ఇతర అధికారులతో చర్చించిన అనంతరం ఈ ప్రక్రియను మరింత విస్తరిస్తామని వెల్లడించింది.
వివిధ గ్రూపుల ద్వారా పెద్ద ఎత్తున వాట్సాప్ సందేశాలను పంపిస్తున్న ఖాతాలను గుర్తించి మరీ వేటు వేయనుంది.
నెలకు 20లక్షల అనుమానిత ఖాతాలను రద్దు చేస్తోందట.
గతంలో వివాదాస్పదంగా వ్యవహరించిన, వేధింపులకు పాల్పడిన ఫోన్ నంబర్‌ను, లేదా రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించిన కంప్యూటర్ నెటవర్క్‌ను తమ వ్యవస్థలు గుర్తించగలవని పేర్కొంది. తమది బ్రాడ్కాస్ట్ ప్లాట్‌పాం కాదు అనే విషయాన్ని దేశంలోని పలు రాజకీయ పార్టీలు గుర్తించాలని వాట్సాప్ కమ్యూనికేషన్ హెడ్ కార్ల్ వూగ్ ప్రకటించారు.