మన ప్రధాని-రాష్ట్రపతులకు అమెరికా రక్షణ

భారత రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణించే ఎయిర్‌ ఇండియా 1 బోయింగ్‌-777 విమానాల్లో అత్యాధునిక రక్షణ వ్యవస్థను అందించేందుకు అమెరికా అంగీకరించింది. వాటి విలువ సుమారు 190 మిలియన్‌ డాలర్లు ఉండొచ్చని అంచనా. అమెరికా రక్షణ సహకార సంస్థ(డీఎస్‌సీఏ) ఈ వ్యవస్థను ఏర్పాటుచేయనుంది. దీనితో భారత్‌, అమెరికాల మధ్య రక్షణ సంబంధాలు బలోపేతమవుతాయని అమెరికా రక్షణ విభాగం ఓక ప్రకటనలో తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌లో ఎలాంటి రక్షణ వ్యవస్థ ఉందో అలాంటి దానినే ఎయిర్‌ ఇండియా వన్‌లో ఏర్పాటు చేయనున్నట్లు డిఎస్‌సీఏ తెలిపింది. విమానంపై ఎవరైనా క్షిపణులను ప్రయోగించినప్పుడు గుర్తించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. అలాగే మనుషుల సాయం లేకుండానే ప్రతిదాడి చేయడానికి అంతర్గత రక్షణ వ్యవస్థ సమాయత్తం అవుతుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ప్రమాదాలను గుర్తించడానికి అనేక సెన్సార్లను ఇందులో అమర్చారు. ఇలాంటి వ్యవస్థల వాడకం ద్వారా భారత్‌కు రక్షణ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని డీఎస్‌సీఏ పేర్కొంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com