షష్టి పూర్తి

‘నవరస నటనా సార్వభౌమ’గా ఖ్యాతిగాంచిన నటుడు కైకాల సత్యనారాయణ. ఆయన ‘సిపాయి కూతురు’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రం విడుదలై అరవై ఏళ్లైంది. అంటే నటుడిగా షష్టి పూర్తి జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణని వంశీ ఇంటర్నేషనల్‌ సంస్థ ‘కైకాల సత్యనారాయణ షష్టిపూర్తి – కనకాభిషేక మహోత్సవం’ పేరిట సత్కరించబోతోంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు వంశీ రామరాజు మాట్లాడుతూ ‘‘ఈనెల 12న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కొణిజేటి రోశయ్య, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, గిరిబాబు, కోదండరామిరెడ్డి, కోడిరామకృష్ణ, బి.గోపాల్‌, రేలంగి తదితరులు పాల్గొంటార’’న్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com