2277 పరుగులతో అగ్రస్థానంలో

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ టీ20ల్లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధ సెంచరీ (50) చేసిన రోహిత్ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 2277 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో గప్తిల్, షోయబ్ మాలిక్, విరాట్ కోహ్లీ, బ్రెండన్ మెకల్లమ్‌లు నిలిచారు. 2272 పరుగులో గప్తిల్ రెండో స్థానంలో నిలవగా, 2263 పరుగులతో షోయబ్ మాలిక్, 2167 పరుగులతో విరాట్ కోహ్లీ, 2140 పరుగులతో బ్రెండన్ మెకల్లమ్ వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక, టీ20ల్లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన రికార్డును కూడా రోహిత్ సొంతం చేసుకున్నాడు. తాజా అర్ధ సెంచరీతో 20 సార్లు ఆ ఘనత సాధించి ఈ జాబితాలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. 19 అర్ధ సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో నిలవగా, 16 అర్ధ సెంచరీలతో మార్టిన్ గప్తిల్, 15 అర్ధ సెంచరీలతో క్రిస్‌గేల్, మెకల్లమ్, 14 హాఫ్ సెంచరీలతో తిలక్‌రత్నే దిల్షాన్ వరుసగా ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com