భారతీయ ఉత్పత్తులపై అమెరికా రాయితీలు ఎత్తివేత

అమెరికాకు ఎగుమతి అవుతున్న భారతీయ ఉత్పత్తుల ఎగుమతులకు దశాబ్దాలుగా పొందుతున్న రాయితీలకు తెర పడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ(జీఎస్‌పీ) పేరిట 1970 నుంచి మనదేశం పొందుతున్న ఎగుమతి రాయితీలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ జోక్యంతో ముగింపు పలకనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే మనదేశం నుంచి ఎగుమతి అవుతున్న 5.6 బిలియన్‌ డాలర్ల విలువైన సుమారు 2000 ఉత్పత్తులపై ప్రభావం పడనుంది. ప్రస్తుతం వీటికి అమెరికా సుంకాలేమీ విధించడం లేదు. ‘‘జీఎస్‌పీ’’ రద్దు అయితే అమెరికా సుంకాలు విధిస్తుంది. ఫలితంగా మన ఉత్పత్తుల ధర పెరిగి, డిమాండు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆభరణాల పరిశ్రమకు ఇది గట్టి దెబ్బ అని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఏయే ఉత్పత్తులపై ఇరుదేశాలు ఎలాంటి రాయితీలు అనే విషయమై రెండు దేశాల బృందాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. మరో రెండువారాల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇ-కామర్స్‌ కంపెనీల విషయంలో మనదేశం ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల కారణంగా అమెజాన్‌, వాల్‌మార్ట్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. అమెరికా ఎంత ఒత్తిడి చేసినా ప్రధాని మోదీ నిబంధనలు సడలించడానికి అనుమతించలేదని సమాచారం. వచ్చేవారం దిల్లీ పర్యటనకు రానున్న అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్‌ రాస్‌ ఈ విషయంపై మనదేశ ఉన్నతాధికారులతో మాట్లాడనున్నట్లు తెలిసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com