బహమనీ సుల్తాన్ల పళ్లెం బ్రిటన్ వద్దే

భారత్‌కు చెందిన అరుదైన పురాతన కళాఖండం ‘బిద్రీ ట్రే’ బ్రిటన్‌లోనే ఉండిపోనుంది. బహమని సుల్తానులు దక్కన్‌ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో ‘నీటి చుక్క ఆకృతి’లోని అరుదైన ఈ బిద్రీ ట్రే (పళ్లెం)ను తయారు చేశారు. జింక్‌ను కరిగించి పళ్లెంగా పోతపోసి.. వెండి పూతతో అందమైన పూలతో తీర్చిదిద్దారు. 17వ శతాబ్దంలో మన కళాకారుల పనితనానికి, లోహంతో చేసిన ప్రయోగాలకు అద్దంపట్టే ఈ కళాఖండాన్ని కర్ణాటకలోని బీదర్‌లో తయారు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ ట్రే దేశం దాటి పోకుండా థెరెసా మే ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. దానిని లండన్‌లోనే ఉంచాలని ప్రభుత్వ ఉన్నత కమిటీ నిర్ణయించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com