Sports

ఆసియా చదరంగం పోటీలో తెలంగాణా కుర్రాడి ప్రతిభ

ఆసియా చదరంగం పోటీలో తెలంగాణా కుర్రాడి ప్రతిభ

ఆసియా అండర్‌-14 ఆన్‌లైన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ కుర్రాడు వి. ప్రణీత్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. తొలి బోర్డుపై ఆడిన ప్రణీత్‌ మొత్తం తొమ్మిది గేముల్లో ఏడింటిలో గెలిచి, ఒక ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. 7.5 పాయింట్లతో ప్రణీత్‌ అగ్రస్థానంలో నిలిచి వ్యక్తిగత స్వర్ణాన్ని అందుకున్నాడు.