Movies

నాకు నాలుగుసార్లు పెళ్లి అయింది

నాకు నాలుగుసార్లు పెళ్లి అయింది

నితిన్‌, కీర్తి సురేశ్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రంగ్‌దే’. మార్చి 26న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ హిట్‌ టాక్‌ అందుకుంది. రీల్‌ అండ్‌ రియల్‌ లైఫ్‌లో టామ్‌ అండ్‌ జెర్రీలా కొట్టుకునే వీళ్లిద్దరూ ఇటీవల సాక్షి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘మహానటి’‌ కీర్తి సురేశ్‌ తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పింది. మానవత్వం మెండుగా ఉండాలని కండీషన్‌ పెట్టింది. అంటే మనిషి మంచోడై ఉంటే అదే చాలు అని పేర్కొంది. ఇంకా తను పెళ్లాడే వ్యక్తి గురించి ఇప్పుడే ఏమీ ఆలోచించట్లేదు అని చెప్పుకొచ్చింది. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం తనకు తెలియకుండానే మూడు నాలుగు సార్లు పెళ్లిళ్లు చేశారని నవ్వేసింది. అయితే తను నిజంగా పెళ్లి పీటలెక్కడానికి ఇంకా బోలెడంత టైమ్‌ ఉందని చెప్పుకొచ్చింది.