* ‘‘ప్రతి సినిమా నాకు కొత్తగా అనిపిస్తుంది.. సెట్లో అడుగుపెట్టగానే ఇది కొత్త పాత్ర, కొత్త నటులు ఇలా అన్నీ కొత్తగానే భావిస్తా’’నని చెబుతోంది బాలీవుడ్ నటి అదితిరావు హైదరి. ఈ అమ్మడు చిత్రసీమలోకి ప్రవేశించి పదిహేను సంవత్సరాలైనా కొత్త సినిమా ప్రారంభం అయ్యిందంటే చాలు అంతా కొత్తగా ఉన్నట్లు అనిపిస్తుందట. ‘‘ప్రతి సినిమాలో నేను కొత్తగా నటిస్తున్నట్లు భావిస్తా. దర్శకుడు చెప్పినప్పుడు నేనేమి చేయబోతున్నానో నాకు తెలియదు అనిపిస్తుంది. కానీ, ఒక్కసారి కెమెరా రోల్ అయి నేను మొదటి షాట్ చేశానంటే, ఇది నా ఇల్లు, ఇది నా పాత్ర, నా తల్లి, నా తండ్రి అనిపిస్తోంది. ఇవి నా గది నుంచి రోజువారిగా తీసే బట్టలు. ఇది మనదే అనిపిస్తోంది. అప్పటి వరకూ భయంగానే ఉంటుంది. అంతేకాదు సినిమా ప్రారంభించడానికి రెండు రోజుల ముందు నేను ఎలా ఉంటానంటే? ఆకలితో ఉన్న చిన్నపిల్లలా మారిపోతా. నిశ్శబ్దంగా ఒక చోట కుదురుగా కూర్చోలేను’’అని తెలిపింది. ప్రస్తుతం అది ‘అజీబ్ దస్తాన్స్’, ‘హే సినిమికా’, ‘మహాసముద్రం’చిత్రాల్లో నటిస్తోంది.
15 ఏళ్లు పూర్తి అయింది
Related tags :