బరువు పోవాలంటే తేగలు తినాలి

తేగలు ఇప్పటి పిల్లలకు తెలియదు కానీ పెద్దవాళ్లకు, ఊళ్లల్లో ఉండేవాళ్లకు బాగా తెలుసు. ఇంగ్లీషులో వీటిని ‘టెండర్‌ పామ్‌ షూట్స్‌’ అంటారు. తేగలను కాల్చుకుని తింటే ఎంతో బాగుంటాయి. వీటిల్లో పోషకవిలువలు అధికంగా ఉంటాయి. తేగల్లో దాగున్న మరికొన్ని విశేషాలు…తేగల్లో పీచుపదార్థాలు ఎక్కువపోషకాలు కూడా ఎక్కువ.తేగలను బాగా ఉడికించి మిరియాలు, ఉప్పు రాసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది.తేగలు తినడం వల్ల బరువు తగ్గుతారు. క్యాన్సర్‌ బారిన పడరు.తేగలను ఉడికించి, చిన్న ముక్కలుగా చేసి మెత్తగా చేసి కొబ్బరిపాలు, బెల్లం, యాలకుల పొడి కలిపి తింటే శరీరంలోని కొలెస్ట్రాల్‌ కరుగుతుంది.తేగల పిండితో రొట్టెల్లా చేసుకుని తినొచ్చు కూడా.తేగల్లో పీచు, కాల్షియం, ఫాస్ఫరస్‌, ధాతువులు, ఒమేగా-3 పుష్కలంగా ఉన్నాయి.వీటిల్లో పొటాషియం, బి, బి1, బి3, సి కూడా ఉన్నాయి.తేగల్లోని పీచుపదార్థాల వల్ల జీవక్రియ బాగా జరిగి ఆరోగ్యంగా కనిపిస్తారు.ఇందులోని విటమిన్‌ సి వల్ల చర్మం నిగనిగలాడుతుంది. అంతేకాదు సి విటమిన్‌ వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది.బ్లడ్‌ క్యాన్సర్‌కు తేగలు చెక్‌ పెడతాయి. ప్రాథమికదశలో ఉన్న క్యాన్సర్‌ని తగ్గిస్తాయి.తేగల్లోని పీచుదార్థాలు పెద్దపేగుల్లో మలినాలు చేరకుండా కాపాడతాయి. శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తాయి.తేగల్లోని క్యాల్షియం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. పాస్ఫరస్‌ శరీరానికి కావలసిన దృఢత్వాన్ని ఇస్తుంది.తేగల వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.రక్తంలో తెల్లకణాలను తేగలు పెంచుతాయి.తేగలను పాలల్లో ఉడికించి ఆ పాలను చర్మానికి రాసుకుంటే మృదువుగా మారుతుంది.ఆకలిని నియంత్రించే శక్తి తేగలకు ఉండడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకోరు. అలా బరువు తగ్గుతారు.ఇవి శరీరానికి చలవనిస్తాయి.నోటిపూతను తగ్గిస్తాయి. వేసవిలో చెమటకాయలను తగ్గిస్తాయి.తేగలు సహజసిద్ధమైన నోటి ఫ్రెష్‌నర్స్‌ కూడా.వీటిలో క్యాలరీలు తక్కువ. మంచి వెయిట్‌లాస్‌ డైట్‌.సోడియం తక్కువగా ఉంటుంది. ఫ్యాట్‌ తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్‌ అస్సలు ఉండదు..

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com