ఖమ్మం లోక్ సభకు దరఖాస్తు చేసుకున్న వీహెచ్

లోక్‌సభ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. గాంధీభవన్‌లో ప్రారంభమైన స్వీకరణ కార్యక్రమంలో తొలి రోజు 30కిపైగా దరఖాస్తులు అందాయి. మరో రెండ్రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు దరఖాస్తు చేసుకున్నారు. నాగర్‌కర్నూలు నుంచి మల్లు రవి, నల్గొండ నుంచి పటేల్‌ రమేష్‌ రెడ్డి, వరంగల్‌ నుంచి ఇందిరా, మహబూబాబాద్‌ నుంచి బెల్లయ్య నాయక్‌, బలరాంనాయక్‌లు దరఖాస్తు చేసిన వారిలో ముఖ్యులుగా ఉన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com