తెలంగాణలో 4పార్లమెంటరీ కమిటీలు ప్రకటించిన జనసేన

జనసేన పార్టీ తెలంగాణలో నాలుగు పార్లమెంటరీ కమిటీలను ప్రకటించింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆదివారం పార్టీ నేతలతో సమావేశమై పార్లమెంటరీ కమిటీల ఏర్పాటుపై చర్చించారు. అనంతరం మెదక్‌, వరంగల్‌, నల్గొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాలకు ఎగ్జిక్యూటివ్‌, వర్కింగ్‌ కమిటీలను ప్రకటించారు. ఇప్పటికే సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, ఖమ్మం స్థానాలకు కమిటీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కూడా పోటీ చేసేందుకు జనసేన పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయలేదు. ముందస్తు ఎన్నికలు రావడం, పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో జరగకపోవడంతో తెంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయామని అప్పట్లో పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలతో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేసిన జనసేన .. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తుందా? లేక వామపక్షాలతో కలిసి పోటీ చేస్తుందా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com