* పది మంది కలిస్తే చాలు పర్యాటక పర్మిట్లపై దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు మొదలుకొని బస్సుల వరకు దేశవ్యాప్తంగా రాకపోకలు సాగించవచ్చు. రాష్ట్రాలు మారినప్పుడల్లా పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. కేవలం ఒకే పర్మిట్ తీసుకుంటే చాలు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వన్ నేషన్– వన్ పర్మిట్’లో భాగంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఇది అమల్లోకి రానుంది. మన రాష్ట్రంలో త్వరలోనే అమలు చేయనున్నట్టు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
* ఇవాళ్టితో ( మార్చి 31,2021)తో పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డు కనుక లింక్ చేయకపోతే, రేపటి నుంచి సదరు పాన్ కార్డు చెల్లుబాటు కాదు అంతేకాదు, తర్వాత లింక్ చేసుకుంటే , అంటే ఏప్రిల్ 1,2021 తర్వాత కనుక లింక్ చేసుకుంటే, వెయ్యి రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుంది ఈ రెండూ జరగొచ్చు. లేదంటే ఏ ఒక్కటైనా జరగొచ్చు. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో కొత్తగా చేర్చిన సెక్షన్ 234హ్ ప్రకారం ఈ చర్యలు తీసుకునేందుకు కేంద్రప్రభుత్వానికి అధికారం దక్కింది. ఈ నెల 23న ఇందుకు సంబంధించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది ఎవరైతే నిర్దేశించిన ఆఖరు తేదీ( ప్రస్తుతానికి మార్చి 31,2021) లోపున ఆధార్, పాన్ అనుసంధానం చేసుకోరో వారిపై చర్యలు తీసుకునేందుకు సెక్షన్ 234హ్ వీలు కల్పిస్తుంది. ఈ తేదీ ఇప్పటికే బోలెడుసార్లు వాయిదా వేస్తూ గడువు పెంచుతూ వచ్చారు. రేపట్నుంచే సదరు చట్టం అమల్లోకి రాబోతుంది కాబట్టి ఆధార్‌తో పాన్ లింక్ చేసుకోవడం బెటర్. గతంలో ఇలా లింక్ చేసుకోనివారిపై జరిమానా విధించడానికి అవకాశం లేదు.కొత్త చట్టంతో ఫైన్ వేస్తారు, ఐతే పాన్ కార్డు పని చేయకపోతే, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరగవు కాబట్టి..ఇది ఎవరికి వారు విధిగా చేసుకోవాల్సిన పనే. ఎందుకంటే పాన్ కార్డ్ లేకుండా ఐటీ రిటన్స్ దాఖలు చేయలేరు. అలానే బ్యాంక్ అక్కౌంట్లు తెరవలేరు. ఓ వేళ తెరిచినా టిడిఎస్ ఎక్కువగా కట్ అవుతుంది.భవిష్యత్తులో ఇలా పాన్ కార్డు జత చేయకుండా లావాదేవీలు నిర్వహించినందుకు ఆదాయపు పన్ను చట్టంలోని 272భ్ సెక్షన్ ప్రకారం పదివేల రూపాయల జరిమానా కూడా విధించవచ్చు.
* ఈ రోజు బంగారం ధర: ఈ రోజు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,500 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,620 పలుకుతోంది.ఈ రోజు బంగారం ధర 100 గ్రాములకు రూ.6,400 పెరిగింది. బుధవారం బంగారం కొనాలని చూస్తున్న సామాన్యులు బంగారం ధర 10 గ్రాములకు 640 రూపాయలు పెరిగిందని గమనించాలి. ఈ రోజు 22 క్యారెట్ల బంగారాన్ని కొనాలనుకుంటే, 10 గ్రాములకు రూ .43,620, 100 గ్రాముకు రూ .4,36,200 చెల్లించాలి. ఈ రోజు 24 క్యారెట్ల బంగారాన్ని కొనాలంటే, 10 గ్రాములకు 44,620 రూపాయలు, 100 గ్రాముకు 4,46,200 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని గోల్డ్ వెబ్‌సైట్ల సమాచారం. మార్చిలో బంగారం ధరలు బాగా తగ్గాయి. కానీ నెల చివరి రోజున, పసుపు లోహ ధర పెరిగింది.
* కోత్త ఆర్థిక సంవత్సరం 2021-22 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుండటంతో భారత ప్రభుత్వం మార్చి 31 వరకు ప్రజలు తమ శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) ను ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి చివరి తేదీగా పేర్కొంది. గతంలో పాన్-ఆధార్ లింక్ గడువును పొడగించిన మాదిరిగానే ఈసారి కూడా పొడగిస్తారని వేచిచూశారు. కానీ, కేంద్రం గతంలో లాగే పాన్-ఆధార్ గడువును పొడగిస్తున్నట్లు ఎటువంటి సమాచారం లేదు. దీనితో చాలా మంది ప్రజలు పాన్-ఆధార్ లింక్ చేయడం కోసం ప్రయత్నించారు. కానీ, ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ మధ్యాహ్నం 12.30 గంటలకు రష్ పెరగడంతో పేజీ క్రాష్ అయింది.