* మోడీ గెలుపు ప్రభావం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనాన్ని అడ్డుకోలేకపోయింది. ఉన్న లాభాలను పోగొట్టుకున్న రూపాయి గురువారం రూ. 70.02 కి చేరింది. బీజేపీ గెలుపు ఖాయమైన తర్వాత ఇప్పుడు స్థూల ఆర్థిక అంశాలపైనే రూపాయి భవిష్యత్ విలువ ఆధారపడి ఉంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇందులో దేశీయ, దేశం వెలుపలి అంశాలూ ఉన్నాయని అన్నారు. అంతర్జాతీయ క్రూడ్ ధరలు, చైనా–యూఎస్ వాణిజ్య యుద్ధంతోపాటు త్వరలో ఆర్బీఐ ప్రకటించబోయే మానిటరీ పాలసీలు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి కదలికలను నిర్దేశిస్తాయని ఎనలిస్టులు వెల్లడించారు.
* కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో జరగనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి చేతిలో కాంగ్రెస్ గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ 49 లోక్‌సభ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాషాయ సునామీలో కాంగ్రెస్ దిగ్గజాలు రాహుల్‌గాంధీ, జోతిరాదిత్య సింథియా, దిగ్విజయ్ సింగ్ వంటివారు తుడిచిపెట్టుకుపోయారు. ఓటమికి గల కారణాలు, తదుపరి కార్యచరణ వంటి పలు అంశాలపై రేపటి భేటీలో నేతలు చర్చించనున్నారు.
* నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్ సీపీ) చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా శ్రీనగర్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్ లో రెండు స్థానాల్లో ఎన్ సీపీ గెలుపొందింది. మరో స్థానంలో కౌంటింగ్ జరుగుతుండగా ఎన్ సీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జమ్మూలోని ఎన్ సీపీ పార్టీ ఆఫీసు వద్ద సంబురాలు మిన్నంటాయి. ఫరూక్ అబ్దుల్లా తన పార్టీ మద్దతుదారులు, అనుచరులతో కలిసి డ్యాన్స్ చేశారు. విజయోత్సవ సంబురాల్లో ఫరూఖ్ అబ్దుల్లా డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
* చిలకలూరిపేట నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్యకర్తకు ,అభిమానులకు తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే విడుదల రజని.పార్టీలు చూడకుండా చిలకలూరిపేట అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని సీఎం జగన్ కావటం తో రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.
* సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం నేపథ్యంలో భాజపా అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషితో భేటీ అయ్యారు నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా పార్టీ కురు వృద్ధుడు అడ్వాణీకి పాదాభివందనం చేశారు ప్రధాని. మోదీతో పాటు భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈ సమావేశానికి హాజరయ్యారు.
* ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ..ట్వీట్ చేశాడు. చంద్రబాబును పోలిన వ్యక్తి హోటల్ లో పనిచేస్తున్న వీడియోను షేర్ చేస్తూ..ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి ఇదీ అంటూ ట్వీట్ చేశాడు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్ర కోసం సరిపోయే వ్యక్తి దొరికాడని..వర్మ గతంలో షేర్ చేసిన వీడియోనే తాజాగా మరోసారి ట్వీట్ చేసి బాబుపై సెటైర్లు వేశాడు. సైకిల్ టైర్ పంక్చర్ అయిందని.. పసుపు కుంకుమ తీసుకొని ఏపీ మహిళలు ఉప్పుకారం రాశారని వర్మ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.
* ఆంధ్రప్రదేశ్ లో భారీ విజయం సాధించిన వైసీపీకి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున.. వైసీపీ విజయం పట్ల జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈమేరకు తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ నూతన యువ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, భారీ విజయం సాధించినందుకు’ అని నాగార్జున పేర్కొన్నారు. కాగా వైయస్ జగన్, నాగార్జున ఇద్దరు స్నేహితులు. ఎన్నికల ముందు నాగార్జున.. జగన్ ను కలిశారు.
* అమెరికా కంపెనీ స్పేస్ఎక్స్ 60 ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించింది. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. ఫ్లోరిడాలోని కేప్ కనరవల్ నుంచి ఆ శాటిలైట్స్‌ను ప్రయోగించారు. ఆ ఉపగ్రహాల ద్వారా ఇక నుంచి హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి.
* కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో జరగనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి చేతిలో కాంగ్రెస్ గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ 49 లోక్‌సభ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాషాయ సునామీలో కాంగ్రెస్ దిగ్గజాలు రాహుల్‌గాంధీ, జోతిరాదిత్య సింథియా, దిగ్విజయ్ సింగ్ వంటివారు తుడిచిపెట్టుకుపోయారు. ఓటమికి గల కారణాలు, తదుపరి కార్యచరణ వంటి పలు అంశాలపై రేపటి భేటీలో నేతలు చర్చించనున్నారు.
* ఈవీఎంల పని తీరుపై ప్రజల్లో అనుమానాలున్నాయని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు అన్నారు. శరద్‌పవార్ లాంటి నాయకులు కూడా వీటిపై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సందేహాలను ఈసీ నివృత్తి చేయాలని కోరారు. ఏమైనా ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు.
*తెలంగాణలో మూడు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడంతో గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంది.
*రెండోసారి అఖండ మెజార్టీతో మోదీ నాయకత్వంలో భాజపా గెలవడం నవ భారత నిర్మాణానికి పునాది అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు.
*ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైకాపా అధినేత వైఎస్ జగన్ గురువారం విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి ఫోన్ చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నట్లు శారదాపీఠం ఒక ప్రకటనలో తెలిపింది.
*వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 30న చేయనున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారని విశ్వసనీయంగా తెలిసింది.
*ఈ నెల 31న జరగనున్న వరంగల్, నల్గొండ, రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు.
*ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైకాపా అధినేత వైఎస్ జగన్ గురువారం విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి ఫోన్ చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నట్లు శారదాపీఠం ఒక ప్రకటనలో తెలిపింది.
*ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్రంలో గురువారం పలు నియోజకవర్గాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఆదిలాబాద్, వరంగల్, చేవెళ్ల నియోజకవర్గాల్లో చాలా వరకు తెరుచుకోలేదు. ఆ తర్వాత వాటిని సరిచేసి లెక్కింపు కొనసాగించారు.
*వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోదీపై పోటీ చేసిన నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు సున్నం ఇస్తారికి 787 ఓట్లు వచ్చాయి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడుకు చెందిన నలుగురితోపాటు నిజామాబాద్ జిల్లా నుంచి 50 మంది అన్నదాతలు వారణాసిలో పోటీ చేసేందుకు వెళ్లారు. *
*పిన్న వయస్కులు చట్టసభలోకి అడుగుపెట్టబోతున్నారు. 35 సంవత్సరాలలోపు వయసు కలిగి ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచిన వారిలో వైకాపా చెందినవారు నలుగురు ఉన్నారు.
*తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏలలో 2019-20 విద్యాసంవత్సరానికి..గురువారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరిగిన ప్రవేశ పరీక్ష (ఐసెట్-2019)కి 90 శాతం అభ్యర్థులు హాజరయ్యారు.
జగన్‌ను కలిసిన నాగార్జున-తాజావార్తలు–05/24
Related tags :