పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా

తాతగారి ఆశయాలు, ఆలోచనలతో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజా జీవితంలోకి వస్తున్నాను… పార్టీ ఆదేశిస్తే విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తా’నని టీడీపీ సీనియర్ నేత, దివంగత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీ భరత్ అన్నారు. బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. ఏపీలో రాజధాని అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులు పూర్తి చేయగల సమర్ధత నాయకుడు చంద్రబాబు అని ప్రజలు నమ్ముతున్నారని శ్రీ భరత్ అన్నారు. కాగా… సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ రెండో కూతురును శ్రీ భరత్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com