విశాఖలో ఫ్లోట్‌ గ్లాస్‌ తయారీ యూనిట్‌-తాజావార్తలు–02/13

* టీడీపీ కి గుడ్ బై చెప్పనున్న అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాసరావు త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం వైసీపీ లోకి వలసల పర్వం ఆరంభంక్రమేపి కొందరు నేతలు తమ అనుచరులతో కలసి రహస్య మంతనాలు జరిపి తమ భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం
* వీరిలో 94లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు…వీరికి మొదట స్మార్ట్ ఫోన్స్ అందిస్తాం7 వేల175 కోట్లతో స్మార్ట్ ఫోన్లు అందిశిస్తున్నామంఏపీ వ్యవసాయ మండలి ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందంచాయతీ ల్లో పనిచేసే కంటిన్ జెన్స్ ఉద్యోగుల వేతనాల పెంపుకు ఆమోదం1998 డిఎస్సి లో అర్హులై ఉద్యోగం పోదని 36 మందిని సెకండరీ గ్రేడ్ టీచర్స్ గా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని నిర్ణయం2008 డిఎస్సి అర్హత సాధించిన వారిని సెకండ్ గ్రేడ్ టీచర్స్ గా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని నిర్ణయంజిల్లాలోని 28 ఆస్పత్రుల పడకల స్థాయి పెంచుతూ నిర్ణయం తీసుకున్నాంఅమరావతి లో జర్నలిస్ట్ లకు కేటాయించిన భూమి రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాంగతంలో ఎకరా 30లక్షలకు కేటాయించగా ఆ మొత్తాన్ని 10లక్షలకు తగ్గించామువిభజన హామీల సాధన కోసం కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తున్నాంఒకవైపు పార్టీ పరంగా మరోవైపు ప్రభుత్వపరంగా అన్ని పక్షాలను కలుపుకుని పోరు ఢిల్లీలో సీఎం నిర్వహించిన ధర్మపోరాట దీక్షను కొందరు విమర్శలు చేస్తున్నారురాష్ట్ర ప్రయోజనాలు పట్టని కొందరు ప్రభుత్వ ధనం దుర్వినియోగం అంటూ దుష్ప్రచారంఢిల్లీ ధర్మపోరాటం పై దుష్ప్రచారం చేయడం దుర్మార్గంఢిల్లీ దీక్షకు 2.5కోట్లు ఖర్చు అయితే 10కోట్లు అని బీజేపీ, వైసీపీలు విమర్శిస్తున్నారుదీన్ని ప్రజలు గమనించి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలితిత్లి తుపాన్ బాధితులకు పెండింగ్ పరిహారం వెంటనే చెలించాలని నిర్ణయంచిత్తూరు జిల్లాలోని ఒక్కలిగలకు బిసి బి రిజర్వేషన్ వర్తింపు చేయాలని నిర్ణయం.
* రాష్ట్రంలో మరో నాలుగు పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం, బొబ్బిలి, చిత్తూరు, పలమనేరు కేంద్రంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు.. శ్రీకాకుళం పరిధిలో శ్రీకాకుళం నగరపాలక సంస్థతోపాటు ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘాలు, రాజాం నగర పంచాయతీ, మరికొన్ని మండలాలు, గ్రామాలను కలిపి మొత్తం 3,824.63 చదరపు కిలో మీటర్లు చేర్చారు. బొబ్బిలి పరిధిలో బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం పురపాలక సంఘాలతోపాటు పలు మండలాలు, గ్రామాలను కలిపి మొత్తం 2,247 చదరపు కిలో మీటర్లు చేర్చారు. పలమనేరు-కుప్పం-మదనపల్లి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో మదనపల్లి, పలమనేరు, పుంగనూరు పురపాలక సంఘాలతోపాటు మరికొన్ని మండలాలు, గ్రామాలను కలిపి మొత్తం 2,435.50 చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని చేర్చారు.త్తూరు పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో చిత్తూరు నగరపాలక సంస్థతోపాటు పలు మండలాలు, గ్రామాలు కలిపి మొత్తం 3,501.14 చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని చేర్చారు.
*17% సొమ్ము ఆదా.. రఫేల్‌పై కాగ్‌
రఫేల్‌ వివాదంలో ఎంతో కీలకమైనదిగా భావిస్తున్న కాగ్‌ నివేదిక ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ నివేదికలో 126 విమానాల కొనుగోలు డీల్‌తో పోల్చుకుంటే కొత్త డీల్‌లో భారత్‌ అవసరాలకు తగినట్లు మార్పులు చేసిన 36 యుద్ధ విమానాల కొనుగోలులో 17.08 శాతం సొమ్ము ఆదా అయ్యిందని కాగ్‌ తన రిపోర్టులో పేర్కొంది. పాత డీల్‌తో పోలిస్తే కొత్త డీల్‌లో తొలి 18 యుద్ధ విమానాలు 5 నెలల ముందే భారత్‌కు చేరతాయని తెలిపింది.
* రైతులకు రూ.10వేలు.. ఏపీ కేబినెట్‌ నిర్ణయం
అన్నదాతా సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికీ రూ.10వేలు ఇవ్వాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలను ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన రూ.6వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4వేలు ఇవ్వాలని తీర్మానించింది. కేంద్ర పథకానికి అర్హులు కాని రైతులకు పూర్తిగా రూ.10 వేలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. కౌలు రైతులూ ఇందుకు అర్హులుగా పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
* తెదేపాకు ఆమంచి రాజీనామా
ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ రాజీనామా చేశారు. పార్టీ అధినేత చంద్రబాబుకు ఈ మేరకు లేఖ రాశారు. పార్టీకి సంబంధం లేని కొన్ని శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. త్వరలో వైకాపాలో చేరనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో వైకాపా అధినేత జగన్‌ను కలిశారు. త్వరలో అధికారికంగా వైకాపాలో చేరతానని వెల్లడించారు.
*పార్లమెంట్‌ ఆవరణలో తెదేపా ఎంపీల ఆందోళన
కేంద్రం వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్‌ ఆవరణలో తెలుగుదేశం, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. గాంధీ విగ్రహం వద్ద మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతుగా తెదేపా ఎంపీలు, కేంద్రానికి వ్యతిరేకంగా నల్లని దుస్తుల్లో తృణమూల్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మద్దతు తెలిపారు. రాహుల్‌తో పాటు సోనియా, కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆజాద్‌ ఇతర ఎంపీలు పాల్గొన్నారు.
* సెల్‌ఫోన్ల లారీ ఎత్తుకెళ్లిన దుండగులు!
నెల్లూరు జిల్లాలో సెల్‌ఫోన్ల లారీని దుండగులు అపహరించారు. తడ మండలం సమీపంలో ఉన్న శ్రీసిటీ నుంచి సెల్‌ఫోన్ల లోడుతో కోల్‌కతా వెళ్తున్న లారీని మార్గమధ్యంలో దగదర్తి జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లారు. సెల్‌ఫోన్ల లోడుతో వెళ్తున్న లారీని ఆపి డ్రైవర్‌ను సమీపంలో ఉన్న చెట్టుకు కట్టేసి దుండగులు సెల్‌ఫోన్లను మరో లారీకి తరలించుకుపోయారు.
* లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ అమెరికాలోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రసంగించనున్నారు. ఇండియా కాన్ఫరెన్స్‌- 2019లో భాగంగా ఆయన ఈ నెల 17న ‘సంధి దశలో ఇండియా-దిశను మార్చే ఎజెండా’ అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తారు. భారతదేశ రాజకీయాలపై హార్వర్డ్‌ విద్యార్థుల ఆధ్వర్యంలో 16న జరిగే చర్చా కార్యక్రమంలోనూ ఆయన పాల్గొంటారు.
* ప్రియాంక పరిధిలో 41.. సింధియాకు 39
ఒకప్పటి కాంగ్రెస్‌ కంచుకోట ఉత్తర్‌ప్రదేశ్‌లో గత సార్వత్రిక ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టకుని ఆ పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. ఇటీవల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన ప్రియాంక గాంధీ, జ్యోతిరాధిత్య సింధియాకు పార్లమెంటు సీట్ల బాధ్యతలు పంచారు. మొత్తం 80 స్థానాలు ఉన్న యూపీలో ప్రియాంకు 41 ఎంపీ సీట్లు, సింధియాకు 39 సీట్లు అప్పగించారు. అనంతరం ప్రియాంక యూపీలోని పలువురు ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
*రాజకీయాల్లోకి వచ్చే సమయం మహేశ్‌బాబుకు లేదు
రాజకీయాల్లోకి వచ్చే సమయం మహేశ్‌బాబుకు లేదంటున్నారు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్‌. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మహేశ్‌ తెదేపా తరఫున ప్రచారం చేస్తారని పలు మీడియా వర్గాలు రాశాయి. ఈ నేపథ్యంలో నమ్రత ఓ మీడియా ద్వారా ఈ వదంతులపై స్పష్టతనిచ్చారు.‘మహేశ్‌ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఆయనకు రాజకీయాల్లోకి వచ్చే సమయం లేదు. ఒకవేళ సమయం దొరికినా కుటుంబం కోసం వెచ్చిస్తారే తప్ప ఇతర విషయాల్లో జోక్యం చేసుకోరు’అని స్పష్టం చేశారు.
* విచారణలు కక్ష్య సాధింపు చర్యలే: మమతా బెనర్జీ
రాబర్ట్‌ వాద్రాపై విచారణ మోదీ రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో భాగమేనని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కోల్‌కతా విమానాశ్రయంతో వాద్రా విచారణపై ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘వారు(భాజపా) అన్నిచోట్ల ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ విచారణలన్నీ లోక్‌సభ ఎన్నికల ముందు భాజపా చేస్తున్న రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో భాగమే. తిరిగి అధికారంలోకి రాబోనని ప్రధాని మోదీకి ఇప్పటికే అర్థమయింది’’ అని అన్నారు.
* ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌ బుద్గాం జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ రోజు ఉదయం బుద్గాం ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకుని నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. మృతి చెందిన ఉగ్రవాదుల వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
* రేపు ఉదయం 8గం.కు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంఎల్లుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశంఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 14వ తేదీన షెడ్యూల్ ప్రకటన వస్తుందని అంచనా వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు7జిల్లాల పరిధిలోకి రానున్న ఎన్నికల కోడ్ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసే లోపు రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్న సార్వత్రిక ఎన్నికల కోడ్కీలక పెండింగ్ అంశాలకు రేపటి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్న ప్రభుత్వం.
* ఎన్నికల సంఘ నిబంధనలకు లోబడి రాష్ట్రంలో 86 మంది పురపాలక కమిషనర్‌లను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఒకే చోట మూడేళ్లకు మించి, గత ఎన్నికల సమయంలో అదే జిల్లాలో పని చేసిన వారందరికీ స్థాన చలనం తప్పలేదు.
*ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత స్టార్ షతర్లు పీవీ.సింధు, సైనా నెహ్వాల్ లకు కటినమైన డ్రా ఎదిరైంది. మార్చి ఆరున ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ తోలి రౌండ్లో క్రిస్టీ గిల్మూర్ తో పోటీ పడుతుంది. క్వార్టర్స్ లో డిఫెండింగ్ చాంపియన్ ప్రపంచ నంబరు వన్ తై జూయింగ్ తో సైనా తలపడే అవకాశముంది. పురుషుల సింగిల్స్ తోలి రౌండ్లో బ్రెస్ లెవేర్ దేజ్ తో ఏడోసీడ్ కిదాంబి శ్రీకాంత్ తలపడతాడు. తోలి రౌండ్ దాటితే రెండో శ్రీకాంత్ కు జోనాధన్ క్రిస్టి (ఇండోనేషియా) ఎదురువ్వొచ్చు. ఆరంభ రౌండ్లు అధిగమిస్తే క్వార్టర్స్ లో ప్రపంచ నంబరు వన్ కెంటో మొమోట తో శ్రీకాంత్ పోటీపడే అవకాశముంది.
*చేధనల్లో ఎలా ఆడాలో ధోనీని చూసి నేర్చుకున్నానని భారత యువ ఆల్ రౌండర్ విజయ్ శంకర్ అన్నాడు. న్యూజిలాండ్ సీరీస్ లో సత్తా చాటి అభిమానుల దృష్టిలో పడ్డ శంకర్ ఈ సీరీస్ తనకో పాటమని చెప్పాడు. నా చుట్టూ చాలా మంది సీనియర్లు ఉండటం కలిసొచ్చింది.
* విశాఖలో రూ.2,200 కోట్ల పెట్టుబడితో ఫ్లోట్‌ గ్లాస్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు గోల్డ్‌ ప్లస్‌ ఇండస్ట్రీస్‌ ముందుకొచ్చింది. సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు జిమ్మీ త్యాగీ మంగళవారం రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) జాస్తి కృష్ణకిశోర్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఏటా 73 వేల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ యూనిట్‌ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 1,500 మందికి, పరోక్షంగా మరో 12వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు.
*ఫోన్‌ని ఇతరులు వాడకుండా ఫింగర్‌ ప్రింట్‌ లేదంటే ఫేస్‌ఐడీని తాళంగా పెట్టుకుంటాం. మరి, నిత్యం వాడే వాట్సాప్‌ మాటేంటి? ఫోన్‌ని అన్‌లాక్‌ చేస్తే ఇతరులు ఎవరైనా వాట్సాప్‌ని ఓపెన్‌ చేయొచ్చు. అలా కాకుండా వాట్సాప్‌ని ఓపెన్‌ చేయడానికి కూడా ఫింగర్‌ ప్రింట్‌ లేదా ఫేస్‌ఐడీని పెట్టుకుంటే వాట్సాప్‌ డేటా ఎవరి కంటా పడదు. ప్రస్తుతానికి యాపిల్‌ యూజర్లకు ఈ సెక్యూరిటీ సౌకర్యాన్ని కొత్త అప్‌డేట్‌తో పరిచయం చేసింది. ఐఫోన్‌, ఐప్యాడ్‌ల్లో ఈ సౌకర్యాన్ని ఎనేబుల్‌ చేసి వాడుకోవచ్చు. అందుకు సెట్టింగ్స్‌లోని ఎకౌంట్‌ ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయండి. తర్వాత ప్రైవసీ మెనూని ట్యాప్‌ చేసి ‘స్క్రీన్‌ లాక్‌’ అప్షన్‌ని ఎనేబుల్‌ చేస్తే చాలు.
*విద్యుత్తు సంస్థల్లో పని చేస్తున్న ఒప్పంద కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు నిరసన చేపడుతున్నట్లు ఏపీ విద్యుత్తు ఒప్పంద కార్మికుల ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.మల్లికార్జునరెడ్డి మంగళవారం విజయవాడలో తెలిపారు.
*వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలో చేయాలనుకున్న స్వగృహ ప్రవేశం వాయిదా పడింది. ఈ నెల 14న ఆయన గృహప్రవేశం చేయాలని ముందుగా నిర్ణయించారు. ఇప్పుడా కార్యక్రమం వాయిదా వేసుకున్నట్లు పార్టీ రాజకీయ కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
* నాగార్జున సాగర్‌ కుడి కాలువ ఆయకట్టు రైతులు ఆశగా ఎదురుచూస్తున్న గోదావరి-పెన్నా అనుసంధాన ప్రాజెక్టులో తొలిదశ పనులు ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా క్రోసూరు వద్ద మూడో పంపుహౌస్‌ నిర్మాణానికి మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ మంగళవారం మట్టి తవ్వకం పనులు చేపట్టింది.
*తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం విశాఖపట్నం వెళ్లే అవకాశం ఉంది. అక్కడ శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలని పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర స్వామి సీఎంను ఆహ్వానించారు. కుటుంబ సమేతంగా కేసీఆర్‌ విశాఖ వెళ్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొంటారని తెలుస్తోంది.
*ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ధర్నాల పేరుతో పార్టీప్రయోజనాల కోసం ప్రజా ధనం దుర్వినియోగం చేస్తోందని రాష్ట్రపతి కోవింద్‌కు అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఫిర్యాదు చేశారు. మంగళవారం రాష్ట్రపతితో భేటీ అయిన ఆమె ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ను రాష్ట్రం విస్మరించిందని ఆరోపించారు.
*సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా వ్యవహరించిన ఎం.నాగేశ్వరరావు, ఆ దర్యాప్తు సంస్థ న్యాయ సలహాదారు ఎస్‌.భాసురామ్‌లు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సుప్రీం కోర్టు మంగళవారం తేల్చింది. వారిద్దరికీ చెరో రూ.లక్ష జరిమానా విధించింది. మంగళవారం కోర్టు సమయం ముగిసేవరకూ వారు కోర్టు గదిలోనే కూర్చోవాలని ఆదేశించింది.
*వినియోగదారులు కోరుకునే చెల్లింపు ఛానళ్ల ఎంపిక గడువును ట్రాయ్‌ మార్చి 31 వరకు పొడిగించింది. ఇప్పటివరకు ఛానళ్లు ఎంపిక చేసుకోని వినియోగదారులకు ‘‘ఉత్తమ అనువైన ప్లాన్‌’’ను డిస్ట్రిబ్యూషన్‌ ప్లాట్‌ఫారం ఆపరేటర్లు(డీపీఓ) ఎంపిక చేయాలని ఆదేశించింది. వినియోగదారులు ఇష్టంగా చూసే ఛానళ్లు, వారు మాట్లాడే భాష, ఛానళ్లకుండే ఆదరణ ప్రాతిపదికలుగా ఈ ప్లాన్‌ ఉండాలని సూచించింది.
*ఐషర్‌ ట్రాక్టర్‌ కంపెనీ రెండు కొత్త మోడళ్లను మంగళవారం తెలంగాణ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఐషర్‌ 650, ఐషర్‌ 188 మోడళ్లను యాదాద్రి జిల్లా భువనగిరిలో కంపెనీ జనరల్‌ మేనేజర్‌ సోమశేఖర్‌ విడుదల చేశారు. రాష్ట్ర వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా ఈ మోడళ్లను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా దసరా, దీపావళి ధమాకా ప్రత్యేక ఆఫర్‌ విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కంపెనీ రీజినల్‌ మేనేజర్‌ సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.
*ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) మరో ఐదు ఉద్యోగ ప్రకటనలను జారీచేసింది. మొత్తం 555 ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది. కమిషన్‌ కార్యదర్శి ఈ మేరకు ఓ ప్రకటన జారీచేశారు.ఉద్యోగ ప్రకటనల పూర్తి సమాచారం వెబ్‌సైట్‌లోఉన్నట్లు తెలిపారు.
* ఏ రాష్ట్రంలోని ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పనిచేసేలా చూడాలంటూ మంగళవారం తెలంగాణ విద్యుత్తు ఇంజినీర్లు జస్టిస్‌ ధర్మాధికారి కమిటీకి వినతిపత్రం సమర్పిం చారు. విద్యుత్తు ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన ఆ కమిటీ విజయవాడలో సమావేశమైంది. తెలంగాణ విద్యుత్తు ఇంజినీర్ల సంఘం అధ్యక్షులు శివాజీ, విద్యుత్తు అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి అంజయ్య ఆధ్వర్యంలో బృందం కమిటీని కలుసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించరాదని వినతిపత్రంలో కోరామని ఓ ప్రకటనలో పేర్కొంది.
*జనాభా ప్రకారం బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాలు డిమాండు చేశాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది బీసీ నేతలు, కార్యకర్తలు మంగళవారం దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. భాజపా, కాంగ్రెస్‌లకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు జాజుల శ్రీనివాసగౌడ్‌, కేశన శంకర్‌రావు ఆరోపించారు.
*రాష్ట్రంలో మండల ప్రజా పరిషత్‌ల సంఖ్య 535కు, జిల్లా ప్రజా పరిషత్‌ల సంఖ్య 30 కానుంది. జులై నెల నుంచి వీటి సంఖ్య పెరగనుంది. కొత్తవాటి ఏర్పాటుకు సంబంధించి పంచాయతీరాజ్‌ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా పంచాయతీరాజ్‌ శాఖ ప్రస్తుతం ప్రతిపాదనలను రూపొందిస్తోంది.
* తెలంగాణ ప్రభుత్వం, ఆసియన్‌ బయోటెక్‌ సంఘాల సమాఖ్య (ఫాబా)ల సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఈ నెల 25 నుంచి 27 వరకు 16వ బయో ఆసియా సదస్సు జరగనుంది. దీనికి 50 దేశాల నుంచి 800 కంపెనీల అధిపతులు, కార్య నిర్వహణాధికారులు, ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, ఔషధ, బయోటెక్‌ రంగాల నిపుణులు హాజరుకానున్నారు. సదస్సులో భాగంగా ప్రపంచ ఆరోగ్య రంగంలో భాగస్వామ్యం అంశంపై నిర్వహించే కాఫీ టేబుల్‌ టాక్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం పాల్గొంటారు.
*జనాభా ప్రకారం బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాలు డిమాండు చేశాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది బీసీ నేతలు, కార్యకర్తలు మంగళవారం దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. భాజపా, కాంగ్రెస్‌లకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు జాజుల శ్రీనివాసగౌడ్‌, కేశన శంకర్‌రావు ఆరోపించారు.
*వివిధ శాఖల్లో 2,528 ఉద్యోగ నియామకాల ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) మంగళవారం ప్రకటించింది. ఇందులో అత్యధికంగా అటవీశాఖకు సంబంధించిన ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌బీఓ) పోస్టులు ఉన్నాయి.
*దేహదారుఢ్య పరీక్షల్లో అభ్యర్థులు చూపిన ప్రతిభకు సంబంధించిన ప్రతిభా పత్రం (పెర్ఫార్మెన్స్‌ షీట్‌) వెబ్‌సైట్లో పెడతామని తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఎంపికకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
*ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం, రాజమహేంద్రవరం విమానాశ్రయాల్లో మంగళవారం నూతనంగా విస్తరించిన రన్‌వేలను దిల్లీ నుంచి వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి సురేష్‌ ప్రభు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ… ‘గన్నవరంలో ప్రస్తుతం ఉన్న 2,286 మీటర్లు ఉన్న రన్‌వేను 3,360 మీటర్లకు పెంచాం. ఈ రన్‌వేపై ఇక నుంచి బోయింగ్‌ 747, 777 వంటి భారీ విమానాలు దిగేందుకు వీలుంటుంది. ఒకేసారి 16 విమానాలు నిలిపే సామర్థ్యంతో పార్కింగ్‌ ప్రాంతాన్ని విస్తరించాం. భూములిచ్చిన రైతులందరికీ రుణపడి ఉంటాం…’ అని పేర్కొన్నారు.
*హైదరాబాద్‌ జిల్లా కేంద్రాల్లో సమీకృత చేపల మార్కెట్ల ఏర్పాటు దిశగా మత్స్యశాఖ అడుగులు వేస్తోంది. ఇందుకోసం సిద్దిపేటలో ఇటీవల నిర్మించిన మార్కెట్‌ను సందర్శించాలని అన్ని జిల్లాల మత్స్యశాఖ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com