మెక్సికన్ మాదకద్రవ్య నగదును హవాలా చేస్తున్న ప్రవాస తెలుగువ్యక్తికి టెక్సాస్‌లో జైలుశిక్ష

40ఏళ్ల కిందట అమెరికాలో స్థిరపడిన కరీంనగర్‌కు చెందిన గూడిపాటి రవీందర్ రెడ్డి(61)తో పాటు మరో ఇద్దరు భారతీయులను టెక్సాస్‌లోని లారెడో కోర్టు దోషులుగా పరిగణించి జైలుశిక్ష ఖరారు చేసింది. న్యూజెర్సీలో నివాసం ఏర్పరుచుకున్న రవీందర్ NYSA Impex LLC అనే కంపెనీ ద్వారా రెండేళ్ల కాలవ్యవథిలో టెక్సాస్ రాష్ట్రంలోని ఇర్వింగ్‌కు చెందిన మరో ఇద్దరు మెక్సికన్లతో కలిసి మాదకద్రవ్య అమ్మకాల ద్వారా వచ్చిన వందల కోట్ల రూపాయిల నగదును అక్రమ రవాణా చేశాడు. కార్లు, విమానాలు, బస్సుల ద్వారా కట్టల కొద్దీ నగదును వీరు అమెరికా వ్యాప్తంగా చెలామణి చేసి ఆ వివరాలను గోప్యంగా ఉంచారని వీరిపై నమోదైన అభియోగం నిరూపితం అయినందుకు వీరికి జైలుశిక్ష విధించారు. సూట్‌కేసులు, అట్టపెట్టెలు, జిప్ లాక్ సంచిల్లో నగదును కొరియర్ల ద్వారా చేరవేసిన వీరి హవాలా దందా గురించి విని ప్రవాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే ఫార్మింగ్టన్ విద్యార్థుల అంశంలో తెలుగు రాష్ట్రాలపై నీలినీడలు కమ్ముకోగా ఎకాఎకి మాదకద్రవ్యాల ముఠాలతో ప్రవాస తెలుగువారు చేతులు కలిపి అమెరికాలో హవాలాకు తెగబడటం హీనమైన చర్య.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com