Food

కర్బూజాతో కేలరీల గోల ఉండదు

కర్బూజాతో కేలరీల గోల ఉండదు

కర్బూజా తింటే… దాహం తీరడమే కాదు.. ఎండలకు శరీరం డీహైడ్రేషన్‌కూ గురికాదు. తియ్యగా ఉండే దీంట్లో రుచితోపాటుగా పోషకాలూ ఎక్కువే. అవేమిటంటే…
* దీంట్లోని బీటాకెరొటిన్‌ శరీరంలో విటమిన్‌-ఎ తయారీకి తోడ్పడుతుంది. ఈ విటమిన్‌ కళ్లు, చర్మారోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు రోగ నిరోధకశక్తినీ పెంచుతుంది.
* రోజంతటికీ అవసరమైన సి విటమిన్‌ను కర్బూజా అందిస్తుంది. తరచూ జలుబూ, జ్వరాల బారినపడకుండా ఈ విటమిన్‌ తోడ్పడుతుంది.
* కర్బూజాలో పీచు పదార్థం ఎక్కువ. ఇది అధిక కొలెస్ట్రాల్‌ నియంత్రణకు, గుండె సంబంధిత వ్యాధులు రాకుండానూ కాపాడుతుంది
* దీంట్లో చక్కెర ఎక్కువగా ఉండదు. కాబట్టి మధుమేహగ్రస్తులు కూడా తీసుకోవచ్చు. అన్ని వయసుల వారూ, ఏ సమయంలోనైనా దీన్ని తినొచ్చు.
* దీంట్లోని పొటాషియం అధిక రక్తపోటు నుంచి కాపాడుతుంది. తరచూ దీన్ని తీసుకోవడం వల్ల బీపీ బారినపడకుండా ఉండొచ్చు.
* కర్బూజాలో క్యాలరీలూ తక్కువే. అధిక బరువుతో ఇబ్బందిపడేవాళ్లు దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే ఫలితం ఉంటుంది.
* దీంట్లోని విటమిన్‌-ఎ ఎండలకు చర్మం మీద మచ్చలు పడకుండా కాపాడుతుంది. జుట్టు రాలడాన్నీ నివారిస్తుంది.
* కొంతమంది దీన్ని తినడానికి అంతగా ఇష్టపడరు. అలాంటివాళ్లు సలాడ్‌, మిల్క్‌షేక్‌ల రూపంలోనూ తీసుకోవచ్చు.