Fashion

ఏడుపు మంచిదే

Crying is good - Telugu lifestyle News

మనసులో ఏదైనా బాధఉన్నా,ఎవరైనా మనతో పరుషంగా మాట్లాడినా,అవమానించినా కరువుతీరా ఏడ్చిసాంత్వన పొందుతుంటాం. అలా ఏడవడంవల్ల శరీరంలోని కలుషిత పదార్థాలుబయటకుపోతాయి. దాంతోపాటూ ఏడుపు మనిషికి రిలాక్స్‌నిస్తుంది.ఈ విషయాలునెదర్‌లాండ్‌కు చెందిన అధ్యయనకారులు వెల్లడించారు. ఈ అధ్యయనంలోభాగంగాకొందరు వ్యక్తులను వాళ్లు పరిశీలించారు. అధ్యయనంలో పాల్గొన్నపార్టిసిపెంట్స్‌కుఏడుపు సినిమాలను చూపించారు. సినిమా ముగిసిన తర్వాత వారిమానసిక స్థితిని గమనించారు.వీరిలో ఏడవడం అలవాటు లేని వారి మూడ్‌లో ఎలాంటి మార్పు రాలేదని గుర్తించారు. సినిమాచూస్తూ ఏడ్చినవాళ్లు సినిమా అనంతరంకొద్దిసేపు బాధగా ఉన్నా ఇరవై నిమిషాల్లో తిరిగిసినిమా స్ర్కీనింగ్‌కుముందరున్న మూడ్‌లోకే వచ్చేశారు. అంతేకాదు సినిమా చూసినఒకటిన్నరగంట తర్వాతతామెంతో బెటర్‌గా ఫీలవుతున్నామని చెప్పారు. సాధారణంగా ఏడిస్తేమనసుతేలికవుతుంది. కానీ ఈ సూత్రం అందరికీ వర్తించదంటున్నారు పరిశీలకులు.పర్సనాలిటీఅండ్‌ ఇండివిడ్యువల్స్‌ అన్న జర్నల్‌లో వచ్చిన ఒక అధ్యయనంప్రకారం ప్రతి ముగ్గురిలోఒకరు ఏడవడం వల్ల తమ మూడ్‌లో ఎలాంటి మార్పురాలేదని చెబితే, కొద్దిమంది ఏడ్చిన తర్వాత తమ పరిస్థితిమరింతదిగజారిపోయిందని చెప్పారు. అదే సోషల్‌ సపోర్టు ఉన్నవారి ప్రవర్తనలోమంచిమెరుగుదల కనిపిస్తుంటే, సోషల్‌సపోర్టు లేనివారిలో ఆ మార్పు కనపడ్డంలేదు.వర్కుప్లేసులో, అందరి మధ్య ఉన్నప్పుడు ఏడవడం నెగెటివ్‌ఉద్వేగాలనురేకెత్తిస్తుందిట. దీనివల్ల వ్యక్తులకు లాభం కన్నా నష్టంఎక్కువజరుగుతుందిట. మగవాళ్లు ఏడవడాన్ని ఒక బలహీనతగా భావిస్తారు. పైగా మగవాళ్లకన్నాఆడవాళ్లు ఎక్కువ ఏడుస్తారు. ఒక స్టడీ ప్రకారం ఆడవాళ్లు సంవత్సరంలోసగటున 47 సార్లు ఏడిస్తే, మగవాళ్లు ఏడుసార్లు మాత్రమేఏడుస్తారట.యవ్వనంలోకి అడుగుపెట్టేవరకూ ఆడ,మగ పిల్లల ఏడుపులో తేడా ఉండదు. ఇద్దరూసమంగా ఏడుస్తారు. ఆతర్వాతే టెస్టోస్టెరోన్స్‌ అబ్బాయిల్లో ఈ గుణాన్నితగ్గిస్తాయిట. అమ్మాయిలు ఎక్కువగా ఏడవడానికి ఈసో్ట్రజన్‌, ప్రొలాక్టిన్లు కారణమట.ఏడవడం వల్ల సాంత్వన పొందడం లేదా హాని కలగడమనేది పరిస్థితులను బట్టివ్యక్తులవ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుందని అధ్యయనకారులు అంటున్నారు.