Food

పనస నిండా ఆరోగ్యమే

పనస నిండా ఆరోగ్యమే

పనస ఒక పండ్ల చెట్టు.దీన్ని రొట్టె పండు తో కంగారు పడుతుంటారు.పనస మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. తూర్పు ఆసియా దీని జన్మస్థలం. ప్రపంచంలోనే అతి పెద్ద పండును ఇచ్చే చెట్టు ఇదే. దాదాపు ఒక్కోటి 36 కేజీలుంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. పనసపండును కోసేప్పుడు చాకుకు, చేతులకు నూనె రాసుకోవడం వల్ల దాని జిగురు చేతులకు అంటదు. పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును. అన్నంతో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రుణధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి…ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని ప్రకృతి వైద్యుల నమ్మకం . పనస తొనలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి . మనప్రాంతములో పనసను ఎక్కువగా విందు భోజనాలలో కూరగా వాడుతారు . పనస పొట్టుతో ఆవపెట్టినచో ఉరగాయగా వాడవచ్చును . దీనిని సంస్కృతంలో “స్కంధఫలం” అని, హిందీలో “కటహక్‌-కటహర్‌-చక్కీ” అని, బంగ్లా‌లో “కాంటల్”‘ అని, మరాఠిలో “పణస” అని, ఆంగ్లంలో “ఇండియన్‌ జాక్‌ ఫ్రూట” అని‌ అంటారు.

**ఔషధ విలువలు
వైద్య పరముగా జీర్ణ శక్తిని మెరుగు పరచును, జారుడు గుణము కలిగివున్నందున మలబద్దకం నివారించును, పొటాషియం ఎక్కువగా ఉన్నందున రక్తపోటును తగ్గించును, విటమిన్ సి ఉన్నందున వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచును, ఫైటోన్యూట్రియంట్స్ , ఐసోఫ్లేవిన్స్ ఉన్నందున కాన్సర్ నివారణకు సహాయపడును. పనసలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల మంచి ఆరోగ్యాన్నిస్తుంది. దానిలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్‌ క్యాన్సర్‌ వ్యాధిని నిరోధిస్తాయి. అజీర్తి, అల్సర్లను కూడా నయం చేస్తుంది. పొటాషియం మెండుగా లభించడం వల్ల అది రక్తపోటును తగ్గిస్తుంది. పనస ఆకులు, మొక్క జొన్న, కొబ్బరి చిప్పలను కాల్చి చేసిన పొడి పుండ్లను నయం చేయడానికి ఉపయోగిస్తారు. పనస ఆకులను వేడి చేసి గాయాల మీద పెట్టుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. చర్మవ్యాధులు, ఆస్తమా, జ్వరం, డయేరియా నివారణకు పనస వేర్లు ఉపయోగపడతాయి. అధిక బరువును, టెన్షన్‌ను, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అజీర్ణం, పాండు వ్యాధి, నంజు, కడుపునొప్పి, అగ్నిమాంధ్యం, క్షయ, శుక్ర నష్టం, అండవాతం మొదలైన వ్యాధులున్నవారు పనసపండును తినరాదు. చెట్టున పండిన కాయను, కోసిన వెంటనే తింటే, అదంత రుచికరంగా ఉండదు. తయారైన కాయను కోసి, నిలువ ఉంచితే, ఆ పనస తొనలు చాలా తియ్యగా ఉంటాయి. పనస చెట్టు ఆకులతో విస్తర్లు కూడా కుడుతుంటారు. ఈ పండు విరేచనాన్ని బంధిస్తుంది. ఎక్కువగా తింటే అతిసారం కలుగుతుంది. పనస పాలను, ద్రాక్షా సారాయంలో నూరి పట్టు వేస్తే, దెబ్బ, వాపులు తగ్గుతాయి. పండిన పనస ఆకులను, వేరును చర్మ వ్యాధులకు ఉపయోగిస్తుంటారు.

**రకాలు
భారతదేశంలో రెండు రకాల పనసను పండిస్తారు. ఒకటి కూజా చక్క. దీనిలో చిన్న చిన్న తొనలుంటాయి. అవి చాలా తియ్యగా, పీచుగా ఉంటాయి. అవి మృదువుగా ఉండడం వల్ల అందులోని తొనలను వలవడానికి చాకు వంటి పరికరాల అవసరం లేదు. వీటిని బార్కా, బెర్కా అని కూడా అంటారు. రెండవది కూజా పాజమ్‌. ఇవి వాణిజ్య పరంగా ముఖ్యమైనవి. వీటిలో తొనలు పెళుసుగా ఉంటాయి. వీటిని వలవడానికి చాకును తప్పకుండా ఉపయోగించాలి. వీటిని కప, కపియా అని అంటారు. పనస కాయలు పండిన తరువాత త్వరగా పాడవుతాయి. అయితే వీటిని 11 నుండి 13 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర నిల్వ ఉంచితే 3 నుండి 6 వారాల వరకు ఉంటాయి. పచ్చివాటిని ముక్కలుగా కోసి బాగా ఎండబెడతారు. వాటిని డబ్బాల్లో వేసుకుని సంవత్సరమంతా ఉపయోగించుకుంటారు.వాతావరణాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో పక్వానికి వస్తాయి. కొన్ని చోట్ల మార్చి నుండి జూన్‌ మధ్యలో, మరి కొన్ని చోట్ల ఏప్రిల్‌ నుండి సెప్టెంబరు మధ్యలో, ఇంకొన్ని చోట్ల జూన్‌ నుండి ఆగస్టు మధ్యలో అవి కాస్తాయి. వెస్ట్‌ ఇండీస్‌లో జూన్‌లోనూ, ఫ్లోరిడాలో వేసవి చివరిలోనూ వస్తాయి. పనస పైతొక్క తీసి లోపలి భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి కూర చేస్తారు. దీన్ని పనస పొట్టు కూర అని అంటారు.కానీ రొట్టె పండు పూర్తిగా వేరే జాతికి చెందినది. దీన్ని ఇంగ్లీష్ లో బ్రెడ్ ఫ్రూట్ అంటారు. నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం దేశాలవారు పనసను వంటల్లో విరివిగా వాడతారు. కొందరు దీన్ని ప్రధానమైన వంటగా చేసుకుంటారు.

**కలప ఉపయోగాలు
పనస పండే కాదు ఆ చెట్టులోని అన్ని భాగాలూ మనకు ఉపయోగపడేవే. పనస కలపతో వీణలు, మద్దెలలు చేస్తుంటారు. దీని కర్రను ఎక్కువగా చిన్న చిన్న పడవలను తయారు చేయడానికి ఉపయోగిస్తుంటారు. మృదంగం, కంజీర వంటి సంగీత పరికరాలను తయారు చేస్తారు. ఫర్నిచర్‌, తలుపులు, కిటికీలు వంటి గృహోపకరణాల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఫిలిప్పైన్స్‌లో కుతియాపి అనే పడవ భాగాలను కూడా తయారు చేస్తారు. పనస ఆకులను, పండ్లను పశువులకు మేతగా వేస్తారు. మనదేశంలో పనసాకులను వంటల్లో ఉపయోగిస్తారు. వీటిని ఇస్తరాకులుగా కూడా ఉపయోగిస్తారు. పనస జిగురును పింగాణి పాత్రలకు, బకెట్‌లకు పడిన చిల్లులను మూయడానికి ఉపయోగిస్తారు. దీన్ని వార్నిష్‌లలో కూడా ఉపయోగిస్తారు. పనస చెట్టు వేర్లను చెక్కి ఫొటో ఫ్రేములు తయారు చేస్తారు. కొన్ని ఉత్సవాల్లో ఎండిన పనస కొమ్మలను రాకుతూ నిప్పును పుట్టిస్తారు. బౌద్ధ సన్యాసుల దుస్తులకు పనస బెరడుతో తయారు చేసిన డై వేస్తారు. తీర ప్రాంత వాసులు పనస కర్రతో చిన్న చిన్న పడవలను తయారు చేస్తారు.