Movies

చిరంజీవి రాజీనామా

చిరంజీవి రాజీనామా

మా (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) క్రమ శిక్షణ సంఘం నుంచి మెగాస్టార్‌ చిరంజీవి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. నటుడు నరేశ్‌ అధ్యక్షతన 2019 మార్చిలో ఈ సంఘం ఏర్పాటైంది. మొదట్లో అంతా సవ్యంగానే సాగినా.. కొంతకాలానికి ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు రెండుగా విడిపోయారు. ఆ తర్వాత కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, మురళీమోహన్‌ జయసుధలతో కూడిన ఓ క్రమశిక్షణా సంఘం ఏర్పాటైంది. కాగా.. భేదాభిప్రాయాలు సద్దుమణగక ముందే కరోనా వెలుగు చూసింది. ఆ సమయంలో చిరంజీవి ముందుండి సీసీసీ అనే సంస్థను ఏర్పాటు చేసి.. విరాళాలు సేకరించి సినీ కార్మికులను ఆదుకున్నారు. కోవిడ్‌ ప్రభావం నుంచి ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే బయటపడే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ‘మా’ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ సమయంలో ఇన్నాళ్లూ ‘మా’ వ్యవహారాల్లో చురుకుగా వ్యవహరించిన చిరంజీవి క్రమశిక్షణా సంఘానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.