Kids

చాణక్యుడు దీపం కథ

The story of greek ambassador and chanakya

అర్థశాస్త్ర రచయిత, మౌర్య చంద్రగుప్తుని గురువు, మంత్రి అయిన చాణక్యుణ్ణి కలవడానికి ఒకసారి ఓ గ్రీకు రాయబారి వచ్చాడు. చాణక్యుడు సాధారణ మైన పూరి గుడిసెలో ఉండడం చూసిన గ్రీకు రాయబారి ‘మౌర్య చంద్రగుప్తుని మంత్రి పూరి గుడిసెలో ఉండడమా!’ అని ఆశ్చర్యపోయాడు. చాణక్యుడు పూరి గుడిసెలో ఒక మూలన ఒక దీపం వెలుగులో ముఖ్యమైన కాగితాలు ఏవో వ్రాసుకుంటున్నాడు. గ్రీకు రాయబారిని చూసిన వెంటనే చాణక్యుడు ఆ దిశ – మరో దీపం వెలిగించి “రండి! కూర్చోండి. ఏమిటో చెప్పండి” అన్నాడు.”అయ్యా! ఆ దీపాన్ని ఆర్పి ఈ దీపాన్ని మీరు ఎందుకు వెలిగించారో దయచేసి చెప్పండి” అని సందేహం వ్యక్తం చేశాడు గ్రీకు రాయబారి. “నేను దేశానికి సంబంధించిన పనులను ఆ దీపం వెలుగులో చేస్తాను. ఆ దీపం నూనె ఖర్చులను రాజు గారి ఖజానా భరిస్తుంది. ప్రస్తుతం మీరు నాతో సొంత విషయాలు, వ్యక్తి గతంగా మాట్లాడడానికి వచ్చారు. అందుకని ఆ దీపం ఆర్పేసి, ఈ దీపం వెలిగించాను. ఈ దీపం వెలుగులో మనం మాట్లాడుకుందాం. ఈ దీపం, నా జీతం డబ్బులతో కొన్నాను” అని చాణక్యుడు వివరణచ్చాడు. చాణక్యుని నిజాయతీకి, దేశభక్తికీ ఆ గ్రీకు రాయబారి ఆశ్చర్యపోయాడు.